శునకం సాహసం..పిల్లల కోసం పాముతో ఫైట్

Update: 2018-09-20 09:12 GMT
ఓ శునకం.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. తన పిల్లలకు పాలిస్తూ సేదతీరుతోంది. కానీ అప్పుడే ఎక్కడి నుంచో ఓ భారీ తాచు పాము అక్కడికి వచ్చింది. చిన్ని శునక పిల్లలను తినేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన తల్లి  శునకం  పాముతో ఫైట్ కు రెడీ అయ్యింది. తన ప్రాణాలకు తెగించి మరీ వాటిని కాపాడుకునేందుకు పోరాడింది. ఈ పోరు రసవత్తరంగా సాగింది. శునకం, పాము ఫైట్ ను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

కుక్క అరుపులకు అక్కడికి వచ్చిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కానీ వారు రావడానికి ఆలస్యమైంది. ఈ కుక్క-పాము ఫైట్ లో తల్లి శునకం ఎంత ప్రయత్నించినా తన పిల్లలను కాపాడుకోలేకపోయింది. పాము కాటుకు మూడు పిల్ల శునకాలు ప్రాణాలు కోల్పోయాయి. ఒక్క పిల్ల శునకాన్ని మాత్రమే తల్లి కాపాడుకోగలిగింది..   చివరకు స్థానికులు ఆ పామును కర్రలతో వెళ్లగొట్టారు. ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్ లో జరిగింది. తాచుపాము-శునకం భీకర ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News