కొడుకుతో కోడలు శృంగారానికి మామ అడ్డు

Update: 2020-08-05 13:30 GMT
కొడుకుతో కాపురం చేయనీయకుండా కోడలిని లైంగికంగా వేధిస్తున్న కీచక మామ వ్యవహారం బట్టబయలైంది. కోడలు ఒంటరిగా ఉన్న సమయం చూసి అత్తనే మామను ఉసిగొల్పిన దారుణం చోటుచేసుకుంది. కొడుకుతో కలవకూడదంటూ కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మామ కటకటాల పాలయ్యాడు.

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని అల్కాపురికి చెందిన మహిళకు.. గాంధీనగర్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగుపెట్టిన కొత్తకోడలికి కొద్దిరోజులకే వేధింపులు మొదలయ్యాయి.

భర్తతో కాపురం చేయకుండా మామ అడ్డుపడుతుండేవాడు. కోడలిలో ఆత్మ ప్రవేశించిందని.. భర్తతో కాపురం చేస్తే దెయ్యం పట్టిపీడిస్తుందని ఇద్దరినీ కలవనీయలేదు మామ.కొడుకు, కోడలు శృంగారం చేయకూడదని భయభ్రాంతులకు గురిచేశాడు.తిరగబడ్డ కోడలిపై కుటుంబసభ్యులంతా కలిసి కొట్టేవారు.

ఇక తాజాగా కోడలిపై మామ అత్యాచారయత్నానికి దిగాడు. అత్త దీనికి సహకరించడం మరో దారుణం. దీంతో భరించలేకపోయిన ఆ కోడలు పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమామలపై కేసు పెట్టి జైలుకు పంపారు.
Tags:    

Similar News