నేడు రైతు నేతల నిరాహార దీక్ష ... ఢిల్లీ వైపు బారులు తీరిన రైతులు !

Update: 2020-12-14 04:39 GMT
ఢిల్లీ అంచుల్లో రైతులు తమ ఆందోళనను రోజురోజుకి మరింత ఉధృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఉద్యయం నేటి తో 19 రోజులకి చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రైతులు నిరాహార దీక్షకి పూనుకున్నారు. రైతు సంఘాల నేతలు సంఘూ, టిక్రీ సరిహద్దు పాయింట్ల వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నారు. ఉద యం 8నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసం చేస్తామని రైతు నేత గుర్నామ్‌సింగ్‌ చౌదాని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు కూడా జరుగుతాయన్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దులకు వేలాది మంది రైతులు ఇంకా పోటెత్తుతూనే ఉన్నారు.

ఇకపోతే , ఆదివారం జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులు రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు అక్కడికి వెళ్లగా, రైతు సంఘాల నాయకులు వారిని అనుమతించకపోవడంతో వారు అక్కడి నుండి వెనుదిరిగారు. ఢిల్లీ సరిహద్దులోని సింఘు పాయింట్ వద్దకు వేలాదిమంది రైతులు ఇంకా చేరుకుంటూనే ఉన్నారు. సోమవారం నాటికి మరో 10 వేల మంది రైతులు అక్కడికి చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. సింఘు బోర్డర్ వద్దకు వెళ్తున్న రైతులంతా ఎక్కువ రోజులు అక్కడ ఉండేందుకు సిద్దమై వెళ్తున్నారు. ఎన్ని రోజులైనా సరే మాకు న్యాయం జరిగే వరకు ఉద్యయం ఆపే ప్రసక్తే లేదు అని అంటున్నారు.

 రాజస్తాన్,హర్యానాల నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైతులను ఆదివారం షాజహాన్ ‌పూర్ వద్ద పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్,యాక్టివిస్ట్ మేదా పాట్కర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను బలవంతంగా వారితో ఒప్పించేలా చేయడం ఆశ్చర్యంగా ఉందని యోగేంద్ర యాదవ్ అన్నారు. ఆమ్ ఆద్మీ  పార్టీ కార్య‌క‌ర్త‌లు, మ‌ద్ద‌తుదారులు, ఇత‌ర ప్ర‌జానీకానికి ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. రైతుల‌కు మ‌ద్దతుగా సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అంద‌రం ఉప‌వాసాలు చేద్దామ‌ని కేజ్రివాల్ కోరారు. అందరితోపాటే  తాను కూడా ఉప‌వాస దీక్ష చేస్తాన‌ని కేజ్ర‌వాల్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News