భర్త లేని మహిళకు ఫేస్‌బుక్ వల.. నగానట్రతో ఉడాయించిన వ్యక్తి
పెళ్లయిన మూడు నెలలకు భర్తతో విడాకులయ్యాయి. ఆ తర్వాత ఒంటరిగా మిగలడంతో తన కాళ్లపై తాను నిలబడడానికి ప్రయత్నించి సక్సెస్ పొందింది. అలా కష్టపడి ఓ ఉన్నత దశకు చేరుకున్న సమయంలో ఫేస్‌బుక్ నుంచి ఒక విజ్ఞప్తి ఆమె కొంపు ముంచుతుందని తెలియదు. చివరకు అతడి చేతిలో మోసపోయి.. ఇప్పుడు బెదిరింపులకు గురవడం చూస్తుంటే ఆమె జీవితం కన్నీళ్లు మిగిలిస్తోంది. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అతడి ఆటకు అడ్డుకట్ట పడింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కన్యాకుమారి జిల్లా కొట్టారాంలోని పెరుమాల్ పురం గ్రామానికి చెందిన యువతికి 2013లో రాజశేఖరన్‌తో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. అవి చివరకు విడాకుల దాక చేరింది. పెళ్లయిన మూడు నెలలకే భర్తతో విడాకులు తీసుకుని ఆ యువతి ఒంటరిగా మారింది. ఈ సమయంలో తన కాళ్లపై తాను నిలబడాలని ఆమె పట్టుదలతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత కన్యాకుమారిలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు పొందింది. చేతినిండా సంపాదన మొదలవడంతో ఆమె కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడులో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ గా పేరు పొందింది.
ఇలాంటి సమయంలో మూడేళ్ల కిందట ఫేసుబుక్ అకౌంట్ నుంచి కేబుల్ టీవీ ఆపరేటర్ కంపెనీ నిర్వహిస్తున్న లోకేశ్ కుమార్ (28) రిక్వెస్ట్ పంపాడు. దాని ద్వారా ఫ్యాషన్ డిజైనర్ కు ఫేసుబుక్ లో పరిచయమయ్యాడు. వారు చాటింగ్‌తో దగ్గరయ్యారు. ఆ పరిచయం బాగా పెరిగి ఆమె వ్యక్తిగత.. వృత్తిగత వివరాలు లోకేశ్ కుమార్ తెలుసుకున్నాడు. దీంతో ఆమెకు ప్రేమ పేరు మీదుగా వలపు వల విసిరాడు. అనంతరం ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెకు లోకేశ్ కుమార్ దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతడికి శారీరకంగా దగ్గరయ్యింది. దీంతో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ సందర్భంగా దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు తిరిగారు. ఈ క్రమంలో వారు సహజీవనం మొదలుపెట్టారు. ఆమె ఇంటిలోనే లోకేశ్ కుమార్ కాపురం పెట్టాడు.
తాను నిర్వహిస్తున్న కేబుల్ టీవీ కంపెనీని మరింత పైకి తీసుకురావడానికి ఆర్థికంగా సహకరించాలని ఆమెను కోరాడు. తనను పెళ్లి చేసుకుంటానని.. జీవితాంతం తనతో ఉంటానని చెప్పడంతో ఆమె అతడికి డబ్బులు ఇవ్వడానికి అంగీకరించింది. ఆమె నుంచి సుమారు రూ.15 లక్షల బంగారు నగలు తీసుకుని బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఆ తరువాత ఆమెతో ఖరీదైన కారు కొనిపించాడు. అనంతరం ఇతర ఖర్చుల కోసం ఆమె నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా అతడు తప్పించుకునే వాడు. దీనిపై తరచూ ఆమె అడుగుతుండడంతో వాగ్వాదం మొదలైంది. పెళ్లి చేసుకుంటావా ? లేదా ? అని నిలదీయడంతో అతడి మరో రూపం బయటపడింది. నిన్ను పెళ్లి చేసుకోను, మా ఇంట్లో చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు. దీంతో ఆమె షాక్‌కు గురయ్యింది.
ఇక ఆమెను వదిలేసి లోకేశ్ తన ఇంటికి వెళ్లాడు. తనను అన్యాయం చేయడంతో ఆమె హతాశయురాలై అతడి ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగింది. అయితే నిందితుడి తల్లి గీతాకుమారి ఆమెపై విరుచుకుపడింది. విదేశాల్లో తిరిగి నగ్న వీడియోలు తీసుకున్నావ్, ఇప్పుడు నేరుగా నా ఇంటికే వస్తావా ? ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అని ఆమె బెదిరించడం మరో షాకింగ్ ఘటన.
డబ్బులు, కారు, నగలు లాక్కొని ఎంజాయ్ చేసి ఇప్పుడు తనను మోసం చేశాడని ఆమె లోకేశ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి తల్లి గీతా కుమారి, మామ అయ్యస్వామి, లోకేష్ కుమార్ స్నేహితుడు ప్రదీప్ తన రహాస్య వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కన్యాకుమారి జిల్లా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు లోకేశ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.