ఫేస్‌ బుక్‌ ప్రేమ ... భార్యకి తెలియకుండా మరో పెళ్లి, మొదటి భార్య ఏంచేసిందంటే ?

Update: 2020-11-14 23:30 GMT
ఫేస్‌బుక్... కొందరి అమ్మాయిల పాలిట డేంజర్‌ బుక్‌ గా మారుతోంది. సరదాగా ఓ యువకుడితో స్నేహం చేసిన ఓ యువతీ అతడు చెప్పిన మాయ మాటలకి అతనితో ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి చేసుకున్నాడు కదా ఏం మోసం అనుకుంటే పొరపాటే ..అసలు యవ్వారం ఇక్కడే ఉంది. అతడికి అప్పటికే పెళ్లి అయ్యి , ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. పెళ్లి అయ్యి , కొద్ది రోజులు సంసారం చేసిన తర్వాత మొదటి భార్య ఈ గుట్టు రట్టు చేయడంతో రెండు కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.

 ఈ వ్యవహారం పై పూర్తి వివరాలు చూస్తే ... ఈ సంవత్సరం జూన్ 14న వినోద్‌ కి ఫేస్ ‌బుక్ ‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. చాలా బాగున్నావ్, సూపర్, క్యూట్, నైస్, అదుర్స్" ఇలా రకరకాల ప్రశంసలు కురిపించాడు. ఆమె ఏ ఫొటో పెట్టినా, ఏ వీడియో పెట్టినా , విపరీతంగా పొగిడాడు. దాంతో ఆమె కూడా అతనివైపు ఆకర్షితురాలైంది. రెండు వైపులా ప్రేమ మొదలైంది. ఇవేవీ మొదటి భార్యకు తెలియకుండా వినోద్ డ్రామా నడిపాడు. ఓ రోజు వినోద్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పాడు.

తాను ఒంటరి వాడిననీ, తనకు తల్లి తప్ప ఎవరూ లేరని అన్నాడు. కేరళలోని కన్నూర్‌లో ఉన్న ఆమె ఫ్యామిలీ అతనిపై జాలి పడింది. కూతురితో పెళ్లికి ఒప్పుకుంది. తన స్నేహితులతో వచ్చిన వినోద్, కరోనా సమయం కాబట్టి, తన తల్లిని పెళ్లికి తీసుకురాలేదని చెప్పాడు. నిజమే అనుకున్నారు. పెళ్లైపోయింది. అత్తారింట్లోనే కొన్ని రోజులు ఉన్నాడు.ఆ తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగోలేదనీ, తాను వెంటనే ఇంటికి వెళ్లాలని అన్నాడు. దాంతో కొత్త పెళ్లి కూతురు కూడా, నేనూ మీతో వస్తానంది. సరే అన్నాడు. ఇంతలో మొదటి భార్యకు ఈ విషయం తెలిసింది. హుటాహుటిన ఆమె రెండో పెళ్లి జరిగిన ఇంటికి వచ్చింది. అతను తన భర్త అనీ, ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. అంతే, కొత్త వధువుతోపాటూ  ఆమె కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. వెంటనే అతను కొత్త డ్రామా ఆడాడు. ఆమె ఎవరో తనకు తెలీదనీ. అబద్ధాలు ఆడుతోందని లబోదిబోమన్నాడు. నీ సంగతి చెబుతా అంటూ ఆమె పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే పోలీసులు వచ్చి, అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత, మొదటి భార్యను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని తేల్చారు. ఇక ఇప్పుడు కోర్టు ఏ శిక్ష వేస్తుందో తేలాలి.
Tags:    

Similar News