మాయదారి ఫేస్ బుక్.. ఒక హత్య.. మరో ఆత్మహత్య
ఫేస్ బుక్ చాటింగ్ రెండు మరణాలకు కారణమైంది. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతం మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతాన్ని చూస్తున్నప్పుడు సోషల్ మీడియాతో లాభాల సంగతి ఎలా ఉన్నా.. సమాజంలో రేపుతున్న కలకలం..కల్లోలం అంతా ఇంతా కాదన్న భావన కలగటం ఖాయం.
గద్వాల జిల్లాకు చెందిన 29 ఏళ్ల సుధ అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ కు డిగ్రీ క్లాస్ మేట్. చదువుకునే రోజుల్లో ఆమెను లవ్ చేయాలని వెంటపడేవాడు. ఆమె లైట్ తీసుకుంది. 2011లో మహబూబ్ నగర్ జి్లలాకు చెందిన ఉదయ్ కుమార్ తో పెళ్లైంది. ఇదిలా ఉంటే.. కాలేజీ రోజుల్లో ప్రేమ అంటూ వెంటపడిన కార్తీక్ అన్నోడు సుధ జీవితంలో లేదు. ఇలాంటివేళ.. ఫేస్ బుక్ ఆమె జీవితంలో కొత్త మలుపు తిప్పింది.
ఏడాది క్రితం సుధకు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా కార్తీక్ ఫ్రెండ్ రిక్వెస్టు పంపాడు. ఆమె ఓకే చేసింది. కొంతకాలం స్నేహంగా ఉన్నా.. తర్వాతి కాలంలో అతడ్ని దూరం పెట్టింది. అప్పటి నుంచి కార్తీక్ ఆమెను బ్లాక్ మొయిల్ చేయసాగాడు. నాతో మాట్లాడకుంటే వివాహేతర సంబంధం ఉందని నీ భర్తకు చెబుతా.. నీ భర్తను.. పేరెంట్స్ ను చంపేస్తానంటూ బ్లాక్ మొయిల్ చేయసాగాడు. కారు డ్రైవర్ గా పని చేసే కార్తీక్ ఫిబ్రవరి 24న ఇంటి నుంచి బయటకెళ్లాడు. తర్వాత తిరిగి రాలేదు.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతగాడు హత్యకు గురైన విషయాన్ని పోలీసులు బయట పెట్టారు. ఇదే సమయం లో.. తనను వేధిస్తున్న కార్తీక్ హత్యకు గురయ్యాడన్న సమాచారం విన్నంతనే షాక్ కు గురైన సుధ.. ఆ నేరం తన మీద పడుతుందన్న భయంతో సూసైడ్ చేసుకుంది. ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించిన ఆమె.. దానికి ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను సూసైడ్ చేసుకుంటున్నానని.. తన బిడ్డను సరిగా చూసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
కార్తీక్ మర్డర్ అయితే.. సుధ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటన్న చిక్కుముడి విప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తమ విచారణ లో భాగంగా కార్తీక్ స్నేహితుడు ఒకడు తెర మీదకు వచ్చాడు. తనతో ఫేస్ బుక్ లో స్నేహం చేసే సమయంలో కార్తీక్ తో పాటు.. అతడి స్నేహితుడు సుధకు పరిచయమయ్యాడు. తనను బ్లాక్ మొయిల్ చేస్తున్న వైనాన్ని కార్తీక్ మిత్రుడికి సుద చెప్పటం.. అతడు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీక్ హత్యకు గురి కావటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఏమైనా.. పాత స్నేహం.. ఫేస్ బుక్ కలగలిసి.. ఒక హత్యకు.. మరో ఆత్మహత్యకు కారణమయ్యాయని చెప్పక తప్పదు.