వివాదంపై వివరణ.. క్రికెట్ ​లోకి మతాన్ని లాగడం బాధాకరం..!

Update: 2021-02-11 11:05 GMT
ప్రముఖ క్రికెటర్​ వసీం జాఫర్​ .. ఉత్తరాఖండ్​ హెడ్​ కోచ్​ పదవికి  రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే జాఫర్​పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అతడు ఓ వర్గం వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని విమర్శలు వచ్చాయి. దీంతో తన పదవికి రాజనామా చేశాడు జాఫర్​. అయితే జాఫర్​ రాజీనామా చేసిన సమయంలో సంచలన ఆరోపణలు చేశాడు. ఉత్తరాఖండ్​ దేశవాళి క్రికెట్​లో సెలక్టర్లు పక్షపాతం చూపిస్తున్నారని కూడా ఆరోపణలు చేసి వెళ్లిపోయాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను జాఫర్​ తాజాగా ఖండించాడు.


జాఫర్​ పై ఉన్న ఆరోపణలు ఇవే.. ‘రామ్ భక్త్ హనుమాన్‌కీ జై' అనే నినాదాన్ని ‘గో ఉత్తరాఖండ్'గా మార్చాడని.. ఇక్బాల్​ అబ్దుల్లాను కెప్టెన్​ చేయాలని సూచించాడని.. బయో బబుల్​ క్రికెట్​లోకి మత గురువులను తీసుకొచ్చాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై వసీమ్ జాఫర్​ స్పందించాడు.

‘క్రికెట్​లోకి మతపరమైన విషయాలను తీసుకురావడం బాధాకరం. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే. కెప్టెన్సీ విషయంలో నేను ఒత్తిడి తీసుకొచ్చాననడం అవాస్తవం.

బయో బబుల్లోకి మత గురువులను తీసుకొచ్చింది నిజమే. అయితే సాధన పూర్తయ్యాకే వాళ్లు ప్రార్థనలుచేశారు’ అంటూ తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చాడు వసీం.
Tags:    

Similar News