ట్రంప్ కు నో అంటే నో అనేస్తున్నారు

Update: 2016-08-16 10:11 GMT
రోజులు గడుస్తున్నకొద్దీ కంపు ట్రంప్ కు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాలో దర్శనమిచ్చే ఆయన.. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నా.. వారి మనసుల్లో మాత్రం స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలతో తన ప్రచారాన్ని మొదలెట్టినా.. రిపబ్లికన్ల అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఆయన నోటి మాటమారుతుందని కొద్దిమంది ఆశించారు. కానీ.. అలాంటిదేమీ లేకపోగా.. తన మాటలతో ఒక్కో వర్గాన్ని దూరం చేసుకున్నారు.

తాజాగా జరుపుతున్న పలు పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూత్ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న ట్రంప్ కు నిరాశ తప్పదని చెబుతున్నారు. ఎందుకంటే.. అమెరికాలోని యూత్ ఓటర్లు ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గు చూపుతుండటం గమనార్హం. తాజాగా జరిపిన ఒక పోల్ లో అమెరికా యువత డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ వైపే మొగ్గుచూపటం గమనార్హం. యూఎస్ ఏ టుడే.. రాక్ ద ఓటర్ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో వచ్చిన ఫలితం చూస్తే.. ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రం ట్రంప్ వైపు ఉండగా.. మిగిలిన నలుగురు హిల్లరీ వైపే ఉండటం గమనార్హం.
Read more!

మరో కీలక పరిణామం ఏమిటంటే.. హిల్లరీ క్లింటన్ ను వ్యతిరేకించిన డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ పడిన బెర్నీ సాండర్స్ మద్దతుదారులు సైతం ట్రంప్ వైపు మొగ్గు చూపుతారన్న అంచనా తప్పని తేలిపోయింది. బెర్నీ మద్దతుదారుల్లో 72 శాతం మంది హిల్లరీకి అండగా నిలవగా.. 11 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు ఉండటం గమనార్హం. అమెరికా జనాభా లెక్కల ప్రకారం 7.54 కోట్ల మంది 18 నుంచ 34 ఏళ్ల లోపు వయస్కులు ఉంటే.. వారిలో అత్యధికులు హిల్లరీ వైపు మొగ్గు చూపుతున్న వేళ.. ఇప్పటికైతే ట్రంప్ ఓటమి పక్కా అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తనకు వ్యతిరేకంగా వస్తున్న పోల్ సర్వేలను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టటం గమనార్హం.
Tags:    

Similar News