ఈవీఎంలతో ఏమైనా చేయొచ్చు..బీజేపీ నేత సంచలన కామెంట్లు!

Update: 2019-11-30 13:19 GMT
బీజేపీ విజయాల వెనుక ఈవీఎంల మాయ ఉందని విపక్షాలు తరచూ విమర్శలు చేయడం.. దాన్ని బీజేపీ నేతలు కొట్టిపారేస్తుండడం నిత్యం చూస్తుంటాం. కానీ, తొలిసారి ఒక బీజేపీ నేత కూడా ఈవీఎంలతో ఏదైనా సాధ్యమే అంటూ వ్యాఖ్యలు చేయడంతో విపక్షాలకు అస్త్రం దొరికింది. పశ్చిమబెంగాల్‌ లో మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవడం తెలిసిందే. మూడు స్థానాల్లోనూ తృణమూల్ గెలిచింది. అందులో ఒకటి బీజేపీ సిటింగ్ స్థానం కూడా. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం పాలక తృణమూల్ కాంగ్రెస్‌ కు అనుకూలంగా పనిచేసిందని.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షించినా బై పోల్స్‌ నిర్వహణలో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ పాత్రే ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసం తృణమూల్ కాంగ్రెస్ ఏమైనా చేస్తుందని రాకేశ్ సిన్హా ఆరోపించారు.

అలాగే ఈవీఎంలతో ఏమైనా చేయొచ్చని.. లెక్కింపులో అధికార పార్టీ తేడా చేయడానిక అవకాశం ఉందని ఆయన అన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కలియా గంజ్ - ఖరగ్ పూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి భారీ ఆధిక్యం వచ్చిందని - కానీ - ఇప్పుడు ఆ రెండు చోట్లా తృణమూల్ భారీ ఆధిక్యం సాధించిందని.. ఇవన్నీ తృణమూల్ ఏదో మాయ చేసిందన్న అనుమానాలు కలిగిస్తున్నాయని రాహుల్ అన్నారు.
Tags:    

Similar News