మోడీ ప్రధానిగా ఉన్నా అప్పు అంతలా పెరగటమా?
నిత్యం ప్రధాని మోడీ ఎంత మొనగాడన్న విషయాన్ని తెలిపే పోస్టులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంటాయి. ఇక.. వాట్సాప్ గ్రూపుల్లో మోడీ భజన ప్రోగ్రాం డైలీ సీరియల్ ను తలపించేలా ఉండటం చూస్తున్నదే. మరి.. ప్రచారం ఇలా ఉన్నప్పుడు.. వాస్తవాలు ఎలా ఉన్నాయి? అన్న ప్రశ్న వేసుకుంటే.. సమాధానం మరింత ఆసక్తికరంగా వస్తుందనే చెప్పాలి.
ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లు దాటేసిన వేళ.. ప్రభుత్వంపై రుణభారం తడిచి మోపెడవుతోంది. ఇక.. విదేశీ అప్పుల భారం కూడా అంతకంతకూ పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూన్ చివరకు మొత్తం రుణ భారం ఏకంగా 101.3లక్షల కోట్ల రూపాయిలుగా తేల్చారు. గత ఏడాది మార్చి చివరి నాటికి ఈ భారం రూ.94.6 లక్షల కోట్లు ఉండగా.. ఏడాది వ్యవధిలో దగ్గర దగ్గర ఏడు వేల లక్షల కోట్లకు పెరగటం గమనార్హం.
రూ.101.3లక్షల కోట్లుగా ఉన్న మొత్తం రుణభారంలో విదేశీ రుణభారం రూ.40.73లక్షల కోట్లుగా ఉంది. లాక్ డౌన్ వేళ.. ప్రభుత్వాలకు ఆదాయం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఇటీవల కాలంలో తీసుకున్న రుణాల్ని కలిపితే.. దేశ రుణ భారం భారీగా ఉంటుందని చెప్పక తప్పదు. అయితే.. రుణ భారం మీద ఆర్థికవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తుంటారు. విదేశీ రుణ భారం పెరగటాన్ని కొందరు తప్పు పడితే.. మరికొందరు మాత్రం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు.
ఈ వాదనల్ని పక్కన పెడితే.. ఒకటి మాత్రం వాస్తవం. అప్పు లేనోడు ఈ భూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కానీ.. అప్పు చేశామంటే.. దానికి సంబంధించిన డెవలప్ మెంట్ అంతో ఇంతో కనిపించాలి. ఒక వ్యక్తి వ్యక్తిగత అప్పు భారీగా పెరిగిందనుకుందాం. మరి.. ఆ అప్పు చేసిన మొత్తానికి సంబంధించి ఏమీ కనిపించకపోతే కాస్త ఆలోచించాల్సిందే.
మరికొందరు అప్పు చేసి.. వాటిని ఆస్తుల రూపంలో మార్చటం.. సంపదను మరింత పెంచే పని చేస్తుంటారు. వ్యక్తిగత ఉదాహరణను పక్కన పెడితే.. ఒక దేశంగా చేస్తున్న లక్షలాది కోట్ల రూపాయిలకు సంబంధించిన ఫలాలు దేశ ప్రజలకు దక్కుతుంటే ఫర్లేదు. అందుకు భిన్నంగా సముద్రంలో పోసే మంచినీళ్లగా మారితే మాత్రం.. భవిష్యత్ తరాలు అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. మోడీ లాంటి సమర్థుడైన నేత ప్రధానిగా ఉన్న వేళలో అప్పు పెరగటం ఒక విచిత్రమైతే.. ఆ పెరిగిన అప్పు తాలూకు ఫలితాలు కంటికి కనిపించకపోవటం కూడా ఇబ్బంది పెట్టేదే.