క‌రోనా వ్యాక్సిన్‌ లో ఐరోపా ముంద‌డుగు..మాన‌వ ప్ర‌యోగాలు షురూ!

Update: 2020-04-24 23:30 GMT
మందు లేక‌పోవ‌డం తోనే మాన‌వ ప్ర‌పంచం పై క‌రోనా వైర‌స్ తీవ్రంగా దాడి చేసింది. వ్యాక్సిన్ లేక క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నాం. దీంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ వైర‌స్‌ కు మందు క‌నిపెట్ట‌డానికి ప్ర‌పంచంలోని అన్ని దేశాలు త‌మ శ‌క్తిమేర కృషి చేస్తున్నాయి. వివిధ సంస్థ‌ల‌తో క‌లిసి క‌రోనా వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టేందుకు కృషి చేస్తున్నాయి. అంత‌ర్జాతీయ సంస్థ‌లు, వివిధ విశ్వ‌విద్యాల‌యాలు, శాస్త్ర‌వేత్త‌లు త‌దిత‌రులు క‌రోనా వైర‌స్‌ కు మందు క‌నిపెట్ట‌డంలో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయా దేశాలు క‌రోనా వైర‌స్‌పై ప‌రిశోధ‌న‌ల‌కు స‌హ‌క‌రిస్తున్నాయి. ఇలాంటి ప‌రిశోధ‌న‌ల్లోనే ఐరోపా ముంద‌డుగు వేసింది. ఆ దేశంలో రూపొందించిన వ్యాక్సిన్‌ను ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ త‌యారీ తుది ద‌శ‌కు చేరింది. ప్ర‌స్తుతం మాన‌వుల‌పై ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఈ ప్ర‌యోగాలు విజ‌య‌వంత‌మైతే త్వ‌ర‌లోనే ప్ర‌పంచం ముందుకు క‌రోనాకు విరుగుడు మందు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇట‌లీలో మొదటి హ్యుమన్ ట్రయల్ ఆక్స్‌ఫ‌ర్డ్ (Oxford)లో మొదలైంది. ఇద్దరు వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు. ఈ వ్యాక్సిన్‌పై అధ్యయనానికి 800 మందికి పైగా హ్యుమన్ ట్రయల్స్‌లో పాల్గొన‌డం విశేషం. వీరిలో సగం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇస్తుండగా, మిగతా సగం మందికి మెనింజైటిస్ (meningitis) నుంచి ప్రొటెక్ట్ చేసే కంట్రోల్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీన్ని ట్రయల్ డిజైన్ అంటారు. వ్యాక్సిన్ అందుకున్న వారిలో ఒకరైన ఎలిసా గ్రానెటో (Elisa Granato) ఒక శాస్త్ర‌వేత్త‌. క‌రోనా క‌ట్ట‌డిలో శాస్త్రీయ ప్రక్రియకు త‌న‌వంతుగా మద్దతు ఇచ్చేందుకు త‌న‌పై ప్ర‌యోగానికి సిద్ధ‌మైన‌ట్లు తెలిపారు.

ఈ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం (Oxford University)లోని బృందం మూడు నెలల్లోపు అభివృద్ధి చేచేసింది. జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్ (Jenner Institute)లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ సార గిల్బ‌ర్ట్ (Sarah Gilbert) ఆధ్వ‌ర్యంలో ఈ పరిశోధనలు కొన‌సాగుతున్నాయి. వ్యాక్సిన్‌ను మ‌నుషుల‌కు ఉపయోగించే ముందు ఇది క‌రోనాను త‌గ్గిస్తుందా లేదా అనే విష‌య‌మై ప‌లువురిపై ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నారు. అయితే వారు రూపొందించిన టీకా 80 శాతం ప‌ని చేస్తుంద‌ని ఆ ప‌రిశోధ‌క‌లు భావిస్తున్నారు. ఈ ప్ర‌యోగాలు విజ‌య‌వంత‌మైతే ఆ దేశం అనుమ‌తి పొందిన వెంట‌నే అందుబాటు లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఫెయిలైతే మాత్రం మ‌రికొన్నాళ్ల పాటు క‌రోనా వైర‌స్‌ కు విరుగుడు ఆల‌స్యం కానుంది.

Tags:    

Similar News