అమెరికాలో మరో రాష్ట్రం ఏర్పాటు .. 51 వ రాష్ట్రంగా ఏదంటే ?

Update: 2021-04-23 11:30 GMT
అమెరికా .. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతుంది. అయితే , అమెరికాలో ఉండే  రాష్ట్రాలు ఎన్ని అంటే అందరూ 50 అని చెప్తారు. కానీ, ఇకపై ఆ అమెరికా రాష్ట్రాల సంఖ్య 50 నుండి 51 కి పెరిగింది. అమెరికాలో అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ నూతన రాష్ట్ర ఆవిర్భావానికి శ్రీకారం చుట్టింది. కొత్త రాష్ట్ర బిల్లుకి అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఇంతకీ అమెరికాలో ఏర్పడ్డ ఆ 51 వ కొత్త రాష్ట్రం ఏది అంటే .. వాషింగ్టన్ డీసీ. ఈ వాషింగ్టన్ అమెరికా రాజధాని. కొత్త రాష్ట్రం ఆవిర్భావ బిల్లుకు అనుకూలంగా 216 మంది ఓటు వేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ 208 ఓట్లు పడ్డాయి. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుడు కూడా వాషింగ్టన్ డీసీని రాష్ట్రంగా గుర్తించడానికి అంగీకరించలేదు. రిపబ్లికన్ సభ్యులెవరూ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేదు.

ఈ బిల్లు ఆమోదం పొందే ముందు వరకు వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా లేదు. కొలంబియాలో ఇన్నేళ్లుగా కొనసాగుతూ వచ్చింది. రాష్ట్ర హోదా లేనందువల్ల వాషింగ్టనియన్స్ కొన్ని రకాల పన్నులను అధికంగా చెల్లించాల్సి వస్తోందనే వాదన ఉంది. 2011 లెక్కల ప్రకారం  వాషింగ్టన్ డీసీ పరిధిలో నివసిస్తోన్న జనాభా 6,17,996. ఇప్పుడు ఏడు లక్షలకు దాటి ఉండొచ్చనే అనధికారిక అంచనా. 66 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్ చాలాకాలం నుంచీ ఉంది. ఎండ్ ద ఫిలిబస్టర్ అనే నినాదంతో వాషింగ్టనియన్స్ సుదీర్ఘకాలం నుంచి పోరాటం సాగిస్తున్నారు. స్థానికుల డిమాండ్‌ ను గౌరవిస్తూ- గత ఏడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ పార్టీ ఈ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. దీనికి అనుగుణంగా యూఎస్ హౌస్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేసింది.  ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల .. పరిపాలన మరంత సులభతరమౌతుందని అంటుంటారు.ఫెడరల్ ట్యాక్సులు కొంతమేర తగ్గుతాయని అంచనాలు కూడా వ్యక్తమౌతున్నాయి. అలాగే , హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌ కోసం ప్రతినిధిని ఎన్నుకునే వీలు కూడా ఉంటుంది. రాజధాని కావడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరిని నామినేట్ చేస్తుంటుంది
Tags:    

Similar News