చంద్రబాబు స్వార్ధం కోసం ఎన్నికలు రావు
చంద్రబాబు గత ఏడాది నుంచి అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అంటూ తెగ ఊదరగొడుతున్నారు. తన పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఏమైనా మాట్లాడవచ్చు కాని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ఉన్న చంద్రబాబుకు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రావు అన్న విషయం తెలియదా. ఇక గత ఏడాదిగా జగన్ పాలనలో ఫెయిల్ అయ్యారని చంద్రబాబు అంటున్నారు. ఇలా చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి మధ్యలోనే జగన్ సర్కార్ కూలిపోతుందని చెప్పడమే వింత.
ఎందుకంటే 151 సీట్లను ఇచ్చిన ప్రజలు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ముందస్తు ఎన్నికలను కోరుకుంటారు అన్నది బాబుకు అసలు తెలియదా. దేశంలోనే ఒక బలమైన ప్రాతీయ పార్టీగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్న పార్టీగా టీడీపీ ఉంది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎంతలా ఉన్నా కూడా 40 శాతం ఓటు షేర్ ని టీడీపీ సాధించింది.
అలాంటి పార్టీ ఇపుడు పొత్తుల కోసం తహతహలాడుతున్నది అంటే పార్టీ బాగా డ్యామేజ్ అయింది అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్లే కదా అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇప్పటికి చూస్తే గత మూడేళ్ళుగా దాదాపుగా 75 నియోజకవర్గాలలో ఇంచార్జీలు టీడీపీకి లేరు. ఎందుకంటే వారికి చంద్రబాబు హింట్ ఇచ్చేశారు త్యాగాలు చేయాలని.
ఇక జనసేనతో పొత్తులు ఉంటే వారికి నలభై సీట్లు, బీజేపీ కూడా వస్తే మరో పది సీట్లు పొత్తు పేరిట సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. ఒకవేళ బీజేపీ కలవకపోతే ఉభయ వామపక్షాలకు, కాంగ్రెస్ కి కూడా ఆయా సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు జూమ్ మీటింగులు పెడుతూ ఎన్నికలకు రెడీ అయిపోండి అని ఒకటే నస పెడుతున్నాడు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజం చెప్పాలీ అంటే ఈ టైమ్ లో ఎన్నికలు రావు అన్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసు అంటున్నారు. ఇక గ్రామాలలో చూస్తే మా పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని ఆ పార్టీ వారే అంటున్నారు. ఎవరికి సీటు ఇస్తారో కూడా తెలియదు. ఇక ఎవరికి సపోర్ట్ చేయాలో అసలు తెలియదు. ఇది అతి పెద్ద కన్ఫ్యూజన్. ఈ సమయంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎలా చెబుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఏపీ అప్పుల్లో ఉంటే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని బాబు చెబుతున్న దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా అని అంటున్నారు. ఇక జగన్ని ఫేస్ చేయడానికి జనసేనతో పొత్తు పెట్టుకుంటున్న చంద్రబాబు సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు, ఏది ఏమైనా పొత్తులతోనే వెళ్లాలి కదా అన్న చర్చ ఉంది.
అయినా సరే చంద్రబాబు మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని ఊదరగొడుతున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీలో కొత్తగా చేరాలనుకునేవారు కూడా జనసేనకు ఎక్కడ టీడీపీ సీట్లు ఇస్తుందో తెలియదు కాబట్టి అయోమయంలో ఉన్నారు. కేవలం తమ ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే ఆలోచిస్తూ చంద్రబాబు ఆడుతున్న పొత్తుల రాజకీయం కోసం మేము త్యాగాలు చేయాలా అని టీడీపీలో నాయకులు అంటున్న మాటగా ఉంది.
దాంతో పార్టీలో వారి మాట ఏంటి అంటే ఎన్నికల టైమ్ లో సర్వేలు చూసి అపుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందామనే ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ క్యాడర్ ని గందరగోళంలోకి నెట్టేలా చంద్రబాబు ముందస్తు ఎన్నికల ప్రకటనలు ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల చంద్రబాబు ఎన్నికల కోసం కుర్చీలు, పదవుల కోసం ఎక్కువగా ఆత్ర పడుతున్నారు అన్న సందేశం కనుక జనాలకు చేరితే పార్టీకే అది ఇబ్బంది అని కూడా అంటున్నారు.