ఊపిరి పీల్చుకున్న కవిత.. ముగిసిన విచారణ

Update: 2023-03-20 22:12 GMT
ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ శ్రేణులంతా ఊపిరిబిగబట్టి చూస్తున్న ఎమ్మెల్సీ కవిత విచారణ ఎట్టకేలకు ముగిసింది. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో కవితను ఈరోజు ఈడీ సుధీర్ఘంగా విచారించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సోమవారం విచారణకు హాజరైన కవితను దాదాపు 10 గంటలకు పైగా అధికారులు విచారించారు. పలు నాటకీయ పరిణామాలు ఈ సందర్భంగా చోటుచేసుకున్నాయి.

ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ వెళ్లారు. దీంతో క్షణక్షణం ఏం జరుగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. అయితే కవితను రాత్రి 9 గంటల తర్వాత విచారణను ముగించి వదిలేశారు. అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కవిత విజయ చిహ్నం చూపుతూ తన కాన్వాయ్ లో బయలు దేరారు.

కవితను అరెస్ట్ చేస్తారని చాలా ఊహాగానాలు వచ్చాయి. అయితే కవిత తరుఫు న్యాయవాదులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఆందోళన నెలకొంది. అయితే ఈడీ అధికారులను కవిత లాయర్లు సంప్రదించినప్పుడు పేపర్ వర్క్ మాత్రమే ఉందని.. అది అయిపోయిన తర్వాత పంపిస్తామని చెప్పారని మీడియాకు వివరించారు. అయితే గంటలు గడిచినా కవిత బయటకు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.చివరకు 9 గంటలకు  వదిలిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియానుంచి కవిత బినామీగా ఈడీ పేర్కొన్న రామచంద్ర పిళ్లై వరకూ ఎవరికీ బెయిల్ రాకపోవడం గమనార్హం.  కవిత ఈ స్కాంలో కేంద్ర బిందువు అని పేర్కొన్న ఈడీ ఈరోజు   విచారించి వదిలేయడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా ఊపిరి పీల్చుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News