ఇండిగో సంక్షోభానికి కారణమదే.. ప్రకటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

మంత్రి రామ్మోహన్ నాయుడు విమానయాన రంగం యొక్క భవిష్యత్తు దృష్టిని కూడా వివరించారు.;

Update: 2025-12-08 10:00 GMT

ఇండిగో.. ఇండిగో.. ఇప్పుడు దేశమంతా ఈ సంక్షోభం గురించే చర్చ సాగుతోంది. ఇండిగో సంస్థ ప్రయాణికులను పెట్టిన అవస్థల గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సిన కేంద్ర విమనయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై జాతీయ మీడియా టార్గెట్ చేసి దుమ్మెత్తిపోస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్ లో ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ఇండిగో సంక్షోభానికి అసలు కారణాన్ని బయటపెట్టాడు.

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల ఎదుర్కొన్న విమానాల రద్దు, ఆలస్యల సంక్షోభానికి అసలు ప్రధాన కారణం ఆ సంస్థ అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో ఉన్న సమస్యలు.. సిబ్బంది రోస్టర్లలోని లోపాలు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయడు స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజ్యసభలో ప్రశ్నించినప్పడు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. ఎయిర్ లైన్ ఆపరేటర్ల అంతర్గత నిర్వహణలోపాల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని ఆయన ధ్రువీకరించారు.

సీఏఆర్ నిబంధనల అమలు తప్పనిసరి

విమానయాన రంగంలో కఠినమైన పౌర విమానయాన నిబంధనలు సీఏఆర్ (సివిల్ ఏవియేషన్ రిక్వైర్ మెంట్స్ ) అమలులో ఉన్నాయని.. ఎయిర్ లైన్ ఆపరేటర్లు వాటిని తప్పనిసరిగా పాటించాలని మంత్రి నొక్కి చెప్పారు. ఈ నిబంధనల ముఖ్యంగా సిబ్బంది డ్యూటీ సమాయాలు , విమానాల నిర్వహణ ప్రమాణాలకు సంబంధించినవిగా ఉంటాయి.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో సాంకేతిక అప్డేషన్

మంత్రి రామ్మోహన్ నాయుడు విమానయాన రంగం యొక్క భవిష్యత్తు దృష్టిని కూడా వివరించారు. ఈ రంగంలో నిరంతరం సాంకేతిక అప్టేషన్ జరుగతోందని.. భారతీయ విమానయాన రంగానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో ఇండిగో తన ఆపరేషణల్ ప్రణాళికలను, సిబ్బంది నిర్వహణ వ్యవస్థలను తక్షణమే మెరగుపరుచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

రాజ్యసభలో మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ఈ ప్రకటనతో ఎయిర్ లైన్ ఆపరేటర్ల, తమ సిబ్బంది నిర్వహణ, ఆపరేషన్ ప్లానింగ్ లో మరింత పటిష్టంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇండిగో సంస్థ తమ లోపాలను సరిదిద్దుకోవడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Tags:    

Similar News