ఏపీలో ఆ జిల్లా పూర్తిగా లాక్ డౌన్

Update: 2020-06-23 15:00 GMT
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఒంగోలు, అనంతపురంలలో మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, రాజమండ్రితోపాటు జిల్లాల్లోని ఇతర పట్టణాలు, మండలాల్లో కరోనా కేసులు విస్తరిస్తుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మద్యం షాపులు, కూరగాయల షాపులు మాత్రమే తెరవాలని సూచించారు.

ఇక లాక్ డౌన్ వేళ బయటకు వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. రూల్స్ అతిక్రమిస్తే రూ.500 జరిమానా విధిస్తామని కలెక్టర్ హెచ్చరించాడు.
Tags:    

Similar News