సన్యాసంతో వందల కోట్లు సంపాదిస్తున్నారు!!
ఒంటి మీద ఉండే వస్త్రానికి.. వారు అనుభవించే రాజభోగాలకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఉంటారు ఇప్పటి అధ్యాత్మిక వేత్తలు అలియాస్ బాబాలు.. ఉరఫ్ సన్యాసులు. ఒకప్పుడు అన్నింటిని త్యజించిన వారిని సన్యాసులుగా ఉండేవారు. వారెంతో సింఫుల్ గా ఉండేవారు. మారిన కాలానికి తగ్గట్లు ఆధ్యాత్మిక గురువుల తీరు మారిపోయింది. లక్షలాది మందిని ప్రభావితం చేసే వీరి ఆస్తుల లెక్కలు చూస్తే కళ్లు చెదరాల్సిందే. శాంపిల్ గా కొంతమందిని చూస్తే..
దేశ ప్రజలకు ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని బాబాల్లో ప్రధముడు రాందేవ్ బాబా. పతంజలిని బ్రాండ్ గా మార్చటమే కాదు.. యూనీలీవర్.. కాల్గెట్ పామోలివ్.. పీ అండ్ జీ లాంటి అంతర్జాతీయ కంపెనీలకు సైతం ముచ్చమటలు పోయించిన వ్యాపారిగా ఈ యోగా గురువును చెప్పాలి. ఈయనగారి పతంజలి ఆయుర్వేద వార్షిక టర్నోవర్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.9500 కోట్లు. అంతేకాదు.. రాందేవ్ బాబా నికర విలువ రూ.1500 కోట్లుగా చెబుతారు. ఆయన మీద ఎన్ని వివాదాలు ఉన్నా.. ఆయన ఉత్పత్తుల విక్రయాలు మాత్రం ఏడాదికేడాది పెరుగుతూనే ఉండటం విశేషం. పతంజలి సంస్థ అమ్మే వస్తువుల నాణ్యత మీద ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి.
ప్రస్తుతం జైల్లో ఖైదీగా వ్యవహరిస్తున్న ఆశారామ్ బాపు సీనే వేరు. ఆయన అనుభవించిన యోగాలు.. భోగాలు అన్ని ఇన్ని కావని చెబుతారు. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలుగా తిరుగులేని ఆధ్యాత్మిక గురువుగా చలామణీ అయిన ఆయన.. నేతలు.. అధికారులు.. బడా వ్యాపారాల్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఒక బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా.. తర్వాతి కాలంలో ఆశ్రమంలో కొందరు బాలికలు కనిపించకుండా పోవటం.. హత్యా నేరం ఆరోపణల్లో కేసుల్లో చిక్కుకున్న అతనికి.. అతని కుమారుడికి యావజ్జీవ కారాగార శిక్ష్ పడింది. దేశ విదేశాల్లో 400 ఆశ్రమాలు.. వాటికి తోడుగా 17వేల బాల సంస్కార కేంద్రాల్ని నిర్వహించేవారు. ఆయన ట్రస్టు ద్వారా బాపూ వార్షిక టర్నోవర్ ఏకంగా రూ.350 కోట్లు ఉండేది.
ఆధ్యాత్మిక ప్రవచనాలకు పెట్టింది పేరుగా చెప్పే గురువుల్లో జగ్గీ వాసుదేవ్ ఒకరు. పాతికేళ్ల వయసులో ఆధ్మాత్మిక మార్గాన్ని పట్టిన ఆయన ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సద్గురుగా అవతరించారు. వివిధ మార్గాల ద్వారా ఆయన ఏటా వచ్చే ఆదాయం రూ.150 కోట్లకు పైనే ఉంటుందని చెబుతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువుగా ఫేమస్ అయిన శ్రీశ్రీ రవిశంకర్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున విద్యా సంస్థలతో పాటు.. శ్రీశ్రీ ఆయుర్వేద పేరుతో ఆయుర్వేద ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తుంటారు. ఆయన పేరుతో ఉన్న ఆస్తుల విలువ తక్కువలో తక్కువ రూ.వెయ్యి కోట్లుగా చెబుతారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే నిత్యానంద స్వామీ గురించి తెలిసిందే. తనకు చుట్టుకున్న కేసుల ఉచ్చులో నుంచి బెయిల్ పేరుతో బయటకు వచ్చి.. తెలివిగా దేశం విడిచి వెళ్లిపోవటమే కాదు.. ఏకంగా కైలాస పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకత ఆయన సొంతం. తన సొంత దేశంలో సొంత రాజ్యాంగం.. సొంత కరెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఇతగాడి ఆస్తుల లెక్క ఎవరూ ఇంతని స్పష్టంగా చెప్పలేరు. ఒక అంచనా ప్రకారం ఈ రసిక స్వామీజీ ఆస్తుల నికర విలువ రూ.10వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతారు.
డేరా సచ్చా సౌధ పేరుతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ వెలిగిపోయిన తీరు ఎంత చెప్పినా తక్కువే. డేరా బాబాగా సుప్రసిద్ధుడైన అతడు అత్యాచారం.. హత్యా నేరం మీద యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దేశ విదేశాల్లో 250 ఆశ్రమాల్ని ఏర్పాటు చేయటమే కాదు.. పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి. చివరకు తానే హీరోగా సినిమాలు తీసుకోవటం తెలిసిందే. అతడి ఆస్తుల విషయానికి వస్తే.. సరిగా లెక్కలు లేకున్నా దగ్గర దగ్గరగా రూ.300 కోట్లకు పైనే ఉంటుందని చెబుతారు. ఇతడిపై మరిన్ని క్రిమినల్ కేసులు విచారణ దశలో ఉన్నాయి.