దువ్వాడ ఎమ్మెల్సీ కాకముందే అనుచరులు హల్ చల్.. దౌర్జన్యాలా?

Update: 2021-03-01 07:30 GMT
శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ఇటీవల ఎమ్మెల్సీగా సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే దువ్వాడకు అగ్రతాంబూలం దక్కడంపై ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. మద్యంతాగి హల్ చల్ చేశారు. అడ్డుచెప్పిన స్థానికులపై రాళ్లతో దాడి చేశారు. ఇది తీవ్రఉద్రిక్తతకు దారితీసింది.శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టెక్కలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు హల్ చల్ చేశారు. తాజాగా పాతపట్నంలో వీరు చేసిన హంగామా ఉద్రిక్తతకు దారితీసింది.

దువ్వాడను వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అనుచరులు ఆదివారం స్థానిక నీలమణి దుర్గ ఆలయంలో మొక్కులు చెల్లించేందుకు వచ్చారు. అందులో కొందరు ఆలయ సమీపంలోని మామిడితోటలో మద్యం తాగుతుండగా స్థానికులు ప్రశ్నించారు.భక్తులు వంటలు చేసుకునే ప్రాంతంలో మద్యం తాగొద్దని దువ్వాడ అనుచరులకు సూచించారు.

దీనిపై వారిద్దరి మధ్య వివాదం మొదలైంది. దువ్వాడ అనుచరులు రెచ్చిపోయి స్థానికులపై రాళ్లు రువ్వారు.ఈ దాడిలో ఓ యువతి గాయపడగా.. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News