వైరల్: డాక్టర్ గా దుర్గామాత.. కరోనాసురుడిని చంపేస్తోంది

Update: 2020-10-21 05:00 GMT
దేవీ నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దసరాకు ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలు కరోనా కారణంగా ఈసారి కళ తిప్పాయి. సృజనాత్మకంగా అమ్మవారిని రంగు రంగుల విగ్రహాలతో రూపొందిస్తుంటారు.  తాజాగా ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాజాగా దుర్గామాత విగ్రహం మరొకటి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దుర్గామాతను డాక్టర్ గా తీర్చిదిద్దిన భక్తులు.. కరోనాను కరోనాసురుడిగా విగ్రహాన్ని రూపొందించారు. డాక్టర్ దుర్గామాత.. కరోనా సురుడిని చంపేస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. ఈ ఫొటోను తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో విశేషం ఏంటంటే.. దుర్గామాత డాక్టర్ గా వైట్ కోట్ ధరించగా.. ఆమె చేతిలో త్రిశూలానికి బదులుగా సీరంజి ఉండడం విశేషం. కరోనా సురుడిని వ్యాక్సిన్ తో చంపుతున్నట్టుగా అద్భుతంగా చూపించారు.

కోల్ కతాకు చెందిన ఓ భక్తబృందం కరోనా థీమ్ తో దుర్గామాత విగ్రహాన్ని రూపొందించాడు. ఇందులో అమ్మవారు వైరస్ ను అంతం చేస్తున్నట్టుగా ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు 70వేల షేర్లు, 8వేలకు పైగా స్పందనలు వచ్చాయి.
Tags:    

Similar News