దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలు చూడతరమా!

Update: 2020-09-02 09:10 GMT
హైదరాబాద్ మహానగరం ఎన్నో అద్భుతమైన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలకి నిలయం. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్ నగరంలో పూర్తయింది.  త్వరలోనే దాన్ని ప్రారంభించపోతున్నారు. మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ కి మరింత శోభ తీసుకువస్తుంది అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలోని పెద్ద కేబుల్ వంతెనలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.  ఈ కేబుల్ వంతెన ప్రారంభించడం ద్వారా చాలా మంది ప్రయాణికులకు  చాలా దూరం తగ్గనున్నారు. అంతే కాదు శని, ఆదివారాల్లో ఈ కేబుల్ వంతెన పైకి వాహనాలు అనుమతి చేయకుండా కేవలం సందర్శనకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు అధికారులు.

ఈ క్రమంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలను మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా అందరికి చూపించారు.  బిడ్జి నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీరింగ్‌ బృందాన్ని ఆయన అభినందించారు. మౌలిక సదుపాయాల కల్పన వృద్ధికి కీలకమని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 60శాతం బడ్జెట్‌ను ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. ఏంతో అందంగా, అద్భుతంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నగరవాసులను ఆకట్టుకుంటోంది. విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతూ కనువిందు చేస్తోంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఫీలింగ్‌ ను కలగజేస్తోంది. వావ్.. ఈ బ్రిడ్జి చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంతటి అద్భుతమైన వంతెన ఉందా.. అని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం దొరుకుతుంది.
Tags:    

Similar News