కరోనా చికిత్స : ట్రయల్స్ లో విఫలం..ఆ మందు పనికిరాదా?

Update: 2020-04-24 08:51 GMT
క‌రోనా చికిత్స‌ లో భాగంగా నిర్వ‌హించిన మొద‌టిద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ‌లో రెమ్ ‌డెసివ‌ర్ డ్ర‌గ్ ఫెయిల‌య్యింది. ఈ మందు వాడ‌టం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు ఉన్న‌ట్లు నిపుణులు నిర్ధారించారు. గిలెడ్ సైన్సెన్స్ త‌యారు చేసిన ఈ డ్ర‌గ్ క‌రోనాపై ప‌ని చేయ‌లేద‌ని తేలింది. ఫైనాన్షియల్ టైమ్స్, స్టేట్..  ఈ రెండూ మొట్టమొదట ఈ షాకింగ్ అంశాన్ని రిపోర్ట్ చేశాయి. ఈ మందును ఉత్పత్తి చేస్తున్న గిలీడ్ సైన్సెస్ సంస్థ మాత్రం ఈ ఫలితాలను కొట్టిపారేసింది. 

దీనికి సంబంధించిన నివేదిక‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అందించారు. రెమ్ ‌డెసివ‌ర్ ఔష‌దాన్ని 237 మంది క‌రోనా రోగుల‌పై ప్ర‌యోగిస్తే 158 మందిపై అది సైడ్ ఎఫెక్ట్స్ చూప‌డంతో మొద‌టిద‌శ‌లోనే డ్ర‌గ్ వాడ‌కాన్ని నిషేదించిన‌ట్లు చైనా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వీరిలో 158 మందికి, మిగతా 79 మందికి ఎలాంటి ఔషధాలు ఇవ్వకుండా పరిశీలించారు. రెండు బృందాల్లోని వ్యక్తుల్లో సంభవించిన మార్పుల్ని రోజూ వైద్యులు గమనించారు. ఒక నెల రోజుల తర్వాత రెమ్‌ డెసివిర్ తీసుకున్నవారిలో 13.9శాతం, తీసుకోనివారిలో 12.8శాతం మృతి చెందారు.

అయితే , ఆ తరువాత  క్లినికల్ ట్రయల్స్ ముసాయిదా పత్రాన్ని డబ్ల్యూహెచ్‌ ఓ తన వెబ్‌ సైట్‌ నుంచి తొలగించడం గమనార్హం. డబ్ల్యూహెచ్ ‌ఓ చర్యతో గిలీడ్‌ సైన్సెస్‌ తీవ్రంగా విభేదించింది. అధ్యయనానికి సంబంధించిన ఫలితాలపై తప్పుడు నివేదిక ప్రచురించిందని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. తక్కువ మందిపై ప్రయోగించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని  తెలిపారు.

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ మెడిసిన్ బదులు తమ దేశంలోని  కరోనా రోగుల కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందునే కావాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.  అయితే , ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్  మందు కూడా అన్ని దేశాల్లో ఒకే విధంగా ప‌నిచేయ‌డం లేద‌ని..మ‌నిషి రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ట్టి ఇది ప్ర‌భావం చూపుతుంద‌ని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్  అండ్ ట్రాపికల్ మెడిసిన్ లో ఫార్మాకోపీ డెమియాలజీ ప్రొఫెసర్ స్టీఫెన్ ఎవాన్స్ అన్నారు.
Tags:    

Similar News