ముమ్మాటికి ఓటమిని అంగీకరించను..రిగ్గింగ్ ​తో జో బైడెన్​ గెలిచాడు..ట్రంప్​ కామెంట్స్​!

Update: 2020-11-16 03:15 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తన మొండివాదనను విడిచిపెట్టడంలేదు. రోజుకొక మాట మాట్లాడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. తాను ఓడిపోలేదని వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు.ఇప్పటివరకు ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేస్తూ వచ్చిన ట్రంప్​.. తాజాగా బహిరంగంగానే ఎన్నికల ఫలితాలు తప్పు అంటూ  నిప్పులు చెరిగారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మేజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలినుంచి ఓటమిని అంగీకరించడం లేదు. ఈ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని అక్రమ విధానాలు, రిగ్గింగ్​తో బైడెన్​ గెలుపొందారని ఆరోపిస్తున్నారు. తాజాగా ట్రంప్ మరోసారి బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జో బైడెన్​ గెలుపును నేను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించను. రిగ్గింగ్​, ఎన్నికల జరిగిన అవకతవకలతో బైడెన్​ గెలుపొందారు’ అని ట్రంప్​ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జో బైడెన్​ గెలుపొందినప్పటికి ట్రంప్​ ఓటమిని అంగీకరించకపోవడంతో కొంతమేర అనిశ్చితి నెలకొన్నది.

అధికారాన్ని బదలాయించేందుకు ట్రంప్​ ససమిరా అంటున్నారు. మరోవైపు ట్రంప్ వైఖరిపై జో బైడెన్ కూడా మండిపడుతున్నారు. అధికార బదిలీ విషయంలో కీలక పాత్ర పోషించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా అధికార బదిలీపై ఎలాంటి ప్రక్రియా ప్రారంభించకపోవడం పట్ల బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్ఏపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన వెంటనే జీఎస్ఏ అధికార ప్రక్రయ మొదలుపెట్టాల్సి ఉంటుంది కానీ, ఇప్పటి వరకు ఆ పని ప్రారంభించకపోవడం గమనార్హం.
Tags:    

Similar News