మోదీ - ట్రంప్ గెలిచారు..ఇండియ‌న్లు ఓడారు అనుకోవాలా?

Update: 2020-02-25 15:30 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌న ముగిసింది. వివిధ వ‌ర్గాల‌తో స‌మావేశం - వ‌రుస ప‌ర్య‌ట‌న‌ల‌తో అగ్ర‌రాజ్యాధిప‌తి టూర్ రెండురోజులు వార్త‌ల్లో నిలిచింది. అనేక ఒప్పందాలు ఇరు దేశాల మ‌ధ్య కుదిరాయి. ఆత్మీయ సంభాష‌ణ‌లు ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య సాగాయి. అయితే, ఈ టూర్ వ‌ల్ల ప్ర‌ధానంగా న‌ష్ట‌పోయింది మాత్రం భార‌తీయ యువ‌కులు అంటున్నారు.

త‌న రెండో రోజు టూర్లో భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్‌ ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌  ముఖేశ్‌ అంబానీ - రతన్‌ టాటా - మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా - టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ - ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా  తదితరులు హాజరయ్యారు. `భారత పర్యటన ఎంతో ఆనందం కలిగించింది. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఆరేడు నెలల్లో ఒప్పందం కుదురుతుంది. భారత్‌ తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం అమలు కృషి చేస్తాను. రిపబ్లికన్లకు స్పష్టమైన ఆధిక్యం రావడంతో సంస్కరణలు చేసేందుకు  అవకాశం  వచ్చింది`అని ట్రంప్‌ తెలిపారు.

``మరోసారి నేను అమెరికా అధ్యక్షుడిని కావడం ఖాయం. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నేనే గెలుస్తా.   మేం విజయం సాధిస్తే మార్కెట్లు భారీగా పుంజుకుంటాయి.  సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది. `` అంటూ త‌న మార్కు రాజ‌కీయం ప్ర‌ద‌ర్శించారు. కానీ...త‌న ఎన్నిక త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా నైపుణ్య‌వంతుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న వీసా విధానాల గురించి, ప్ర‌ధానంగా వాటి ఫ‌లితంగా దెబ్బ‌తింటున్న భార‌తీయ నైపుణ్య‌వంతుల గురించి మాత్రం ట్రంప్ ప్ర‌స్తావించ‌లేదు. మొత్తంగా అగ్ర‌రాజ్యాధిప‌తి టూర్‌ తో భారతీయ యువ‌త‌కు, నైపుణ్య‌వంతుల‌కు ఏం ద‌క్కింద‌నే ప్ర‌శ్న‌...అనేక మందిలో స‌హ‌జంగానే మొదులుతోంది.


Tags:    

Similar News