కమలా కంటే ఇండియన్స్ మద్దతు నాకే ఎక్కువ : ట్రంప్ !

Update: 2020-08-15 23:30 GMT
అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. నవంబర్ లో జరిగే ఎన్నికల కోసం రంగంలోకి దిగిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..తన విమర్శల పర్వాన్ని ప్రారంబించారు. డెమోక్ర‌టిక్ ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్‌ పై.. అధ్య‌క్షుడు ట్రంప్ అటాక్ స్టార్ట్ చేశారు. బైడెన్ దేశం లో ఒక్క‌రు కూడా సేఫ్‌ గా ఉండ‌ర‌ని ట్రంప్ అన్నారు.  ఈ ఎన్నికల్లో ప్రవాస భారతీయులు తనకే సపోర్ట్ చేస్తారని..తనవైపే నిలుస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమె కన్నా తనకే ఎక్కువగా భారతీయుల మద్ధతు ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఎన్నిక ప్రచారాన్ని న్యూయార్క్ సిటీ పోలీస్ బెనెవోలెంట్ అసోసియేషన్ శుక్రవారం ఆమోదించింది.

ఆ సందర్భంగా మాట్లాడుతూ.. డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ మరియు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్‌పై మాటల దాడి చేశారు. జో బిడెన్ అధ్యక్షుడైతే అతను వెంటనే అమెరికాలోని ప్రతి పోలీసు విభాగాన్ని తొలగించడానికి చట్టాన్ని ఆమోదిస్తాడు. ఇక కమలా హారిస్ అయితే ఒక అడుగు ముందుకు వేస్తారు. కమలా హారిస్ భారత వారసత్వానికి చెందినది. అయినా కూడా ఆమె కంటే నాకే ఎక్కువ మంది భారతీయుల మద్ధతు ఉంది అని ట్రంప్ అన్నారు. జో బిడెన్, కమలా హారిస్ పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన అన్నారు. కాగా, కమలా హారిస్‌ ను నల్లజాతి ప్రతినిధి గా పరిగణిస్తున్నారా , అన్న మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఏమైనా తనకు సమస్య కాదని అన్నారు. గతంలో కూడా అమెరికా ను పాలించేందుకు కమలా హారిస్ ఎంపిక కరెక్ట్ కాదని తెలిపారు.
Tags:    

Similar News