మీకు జియో సిమ్ ఉందా? చదవటం అస్సలు మిస్ కావొద్దు
డిజిటల్ కాలంలోఅన్ని ఈజీనే. కాస్తంత సాంకేతికత మీద అవగాహన ఉంటే చాలు.. ఏదోలా బురిడీ కొట్టేసేందుకు బోలెడన్ని దారులు దొరికేస్తాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న సామెతను తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు సైబర్ చోరులు. అవకాశం ఉన్న దేన్ని వదలకుండా సామాన్యుల్ని మోసం చేసే తీరు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా సైబర్ దొంగలు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇంతకీ అదెలా అంటారా? అక్కడికే వస్తున్నాం.
మీరు జియో సిమ్ వాడుతున్నారా? అయితే.. మోసపోవటానికి నూటికి నూరుపాళ్లు ఛాన్సు ఉంది. ఎందుకంటే.. సైబర్ చోరుల స్ట్రిప్ట్ అంత పకడ్బందీగా ఉంది మరి. ఇంతకీ వారు వినిపించే కట్టుకథ ఏమంటే.. సైబర్ నేరగాళ్లు జియో కస్టమర్లకు ఫోన్ చేసి.. మీ సిమ్ బ్లాక్ అవుతుంది.. వెంటనే రీఛార్జి అని హడావుడి చేస్తారు. తాము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు. దీనికి ఏ మాత్రం నమ్మేసినా.. నట్టేటా మునిగిపోయినట్లే.
ఎందుకంటే.. రీఛార్జి చేయటానికి రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా రీఛార్జి చేసుకోవాలని చెబుతారు. ఆ యాప్ ద్వారా కస్టమర్ల అకౌంట్లో డబ్బులు కొట్టేస్తారు. తాజాగా.. ఈ తరహా మోసానికి సంబంధించి తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ అందింది. దీంతో.. కేసు నమోదుచేసిన పోలీసులు.. సైబర్ దొంగల కోసం వెతుకుతున్నారు. ఇవాల్టి రోజున జియో సిమ్ వాడుతున్నోళ్లు భారీగా ఉన్న నేపథ్యంలో మోసపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన సైబర్ నేరగాళ్లు తాజాగా ఇలాంటి ఎత్తుగడతో మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.