కేంద్రం ప్రతిపాదనకు ఏపీ కూడా నో అంటోంది!
మోడీ సర్కారు తమకు పరిపాలన అందించ్చిన వెంటనే ఈ దేశాన్ని సమూలంగా మార్చిపారేయాలని ఎంతగానో తహతహ లాడిపోతున్నట్లుగ మనకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా రంగాల్లో కీలకమైన అంశాల్లో మోడీ సర్కారు విప్లవాత్మకమైన 'సరికొత్త' లేదా 'బాగా పాత' నిర్ణయాలను ఆశ్రయిస్తోంది. సంస్కృతభాషను పునరుద్ధరించేయాలని అనుకోవడం, భారతీయ పురాణాలను కూడా పాఠ్యపుస్తకాల్లో పెట్టేస్తారా అని అనుమానం కలిగేలా.. చరిత్రను తమకు తోచిన రీతిలో పుస్తకాల్లోకి చొప్పించాలని అనుకోవడం.. ఇలాంటి అతి విలువైన, కీలకమైన నిర్ణయాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇలాంటి నిర్ణయాల్లో.. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలనేది కూడా ఒకటి.
అయితే ఈ విధానం వలన డ్రాపవుట్స్ పెరుగుతారని.. విద్యాపరంగా వ్యవస్థ మొత్తం కుంటుపడుతుందని పేదలకు విద్య దూరం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ డిటెన్షన్ విద్యా విధానం విషయంలో కేంద్రం తనంత తాను నిర్ణయం తీసేసుకుని అందరి మీద రుద్దకుండా.. రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.
సుమారు నెలరోజుల కిందటే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పలు విడతలుగా ఉపాధ్యాయ సంఘాలు, మేధావులతో సమావేశాలు నిర్వహించి.. డిటెన్షన్ విధానం వద్దేవద్దని.. దీనివల్ల పేదలకు విద్య దూరం అవుతుందని.. చెబుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఇది జరిగి నెలపైగానే గడుస్తోంది.
కాకపోతే.. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పటికి తీరిక దొరికినట్లుంది. ఆయన తాజాగా తాను కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిటెన్షన్ విధానం తిరిగి ప్రవేశపెట్టడాన్ని ఏపీ సర్కారు కూడ వ్యతిరేకిస్తున్నదని ఆయన వెల్లడించారు. డిటెన్షన్ వద్దని అంటూ కేంద్రానికి లేఖ రాశాం అని చెప్పారు.
మొత్తానికి మోడీ ప్రభుత్వపు ప్రతిపాదనను ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ వ్యతిరేకించాయి. ఇంకా పలు రాష్ట్రాలు కూడా నో చెప్పినట్లే తెలుస్తోంది. మరి ఆయన మోనార్క్‌లా వ్యవహరిస్తారో.. తాను ప్రజాస్వామ్యంలో ఉన్నా అని తెలుసుకుంటారో వేచిచూడాలి.