అంతపని చేసినోడితో రాజీయా?

Update: 2015-07-01 08:10 GMT
    అత్యాచారం కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పుచెప్పింది. ఈ కేసుల్లో రాజీ కుదరదని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. అత్యాచారం కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు ఈ రోజు వెలవరించిన కీలక తీర్పులో బాధితురాలితో నిందితుల రాజీ ఒప్పందాలు చెల్లవని తేల్చిచెప్పింది. తమిళనాడు హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీం అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టంచేసింది. అత్యాచారం కేసుల్లో రాజీచేయడం అంటే మహిళలను కించపర్చడమననీ, ఇటువంటి కేసులలో నిందితులు, బాధితులు రాజీ కుదుర్చుకోవాలని కోర్టులే సూచించడం సరికాదని వెల్లడించింది.

    రాజీకి ప్రయత్నాలు జరిగినా అది తీవ్ర తప్పిదమేనని కోర్టు అబిప్రాయపడింది. అత్యాచార కేసులలో రాజీ అంటే మహిళల హక్కులను హరించినట్లేనని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఈ కేసులలో నిందితులు ,భాదితులు రాజీ పడినా నేరమేనని సుప్రింకోర్టు స్పష్టం చేయడం విశేసం.కొద్ది రోజుల క్రితం చెన్నై హైకోర్టులో ఒక జడ్జి రేప్ కేసులలో రాజీ పడేందుకు గాను ,తద్వారా బాదితురాలికి కొంత న్యాయం చేసే ఉద్దేశంతో శిక్షపడిన వ్యక్తికి తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. కానీ.... ఇప్పుడు సుప్రింకోర్టు ఈ తీర్పు ఇవ్వడంతో అలాంటివి చెల్లవని స్పష్టమైంది. దారుణ నేరమైన అత్యాచారాల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై అంతటా హర్షం వ్యక్తంమవుతోంది.
Tags:    

Similar News