ధోనీ న్యూ అవతార్.. క్రికెట్ ఫీల్డ్ నుంచి అగ్రికల్చర్ ఫీల్డ్‌ కు

Update: 2020-02-29 00:30 GMT
టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోనీ కొత్త అవతారమెత్తాడు. ఇన్నాళ్లు మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ ఇప్పుడు పొలం బాట పట్టాడు. రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పండిస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను ధోనీ సోషల్ మీడియా లో షేర్ చేశాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నానంటూ అందులో చెప్పాడు.

ఆ వీడియోలో ధోనీ కొబ్బరికాయను కొట్టి పుచ్చకాయ విత్తనాలు నాటి సాగు ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తే.. మీరు గ్రేట్ మహీ అంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. బురద రాజకీయాల వైపు రాకుండా మీకు నచ్చినట్లుగా జీవించాలని సలహాలు ఇస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం మంచి ఆలోచన.. ఇందులో కూడా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

గత ఆరు నెలలుగా ఆటకు దూరమైన ధోనీ తనకిష్టమైన పనులు చేస్తూ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం బ్యాట్ పట్టని ఈ జార్ఖండ్ డైనమైట్.. రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీ లో పనిచేసి జవాన్‌గా దేశానికి సేవ చేయాలనే తన కోరికను కూడా తీర్చుకున్నాడు. కాగా ఆయన బీజేపీ లో చేరుతారని జార్ఖండ్ ఎన్నికలకు ముందు ప్రచారం జరిగింది. కానీ, ఆయన మాత్రం ఎందుకో రాజకీయాల వైపు వెళ్లకుండా పొలాల వైపు మళ్లారు.
Tags:    

Similar News