లాక్ డౌన్ లో లోదుస్తుల కోసం ఎగబడుతున్నారట..

Update: 2020-06-17 06:30 GMT
లాక్ డౌన్ లో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్నారు. అయితే మహిళలు మాత్రం ఇంట్లోనే ఉంటున్నారు. షాపింగ్ లు చేయకపోవడంతో ఫ్యాషన్ రంగం పూర్తిగా దెబ్బతిన్నది.

ప్రస్తుతం షాపింగ్ మాల్క్ ఓపెన్ చేయడంతో షాపింగ్ లు మొదలయ్యాయి. అయితే రెండు నెలలకు పైగా సాగిన లాక్ డౌన్ లో భారీగా కొన్ని ఆర్డర్ లు వచ్చాయట.. ముఖ్యంగా లింగరే కేటగిరి బ్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. బ్రాలు కొనేందుకు ఆన్ లైన్ లో ఆర్డర్లు కుప్పలుగా వచ్చాయట.. పుష్ అప్ లు, బాల్కనెట్ లు, స్లింకీ లాసి వంటి మరిన్ని రకాల బ్రాలకు వ్యాపారం పెరిగి పోయింది.

లింగరే కేటగిరికి చెందిన లోదుస్తులకు భారీ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మూడు రెట్లు అమ్మకాలు పెరిగాయని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మింత్రా తెలిపింది. లోదుస్తులు, పైదుస్తుల సేల్స్ కూడా భారీగా పెరిగినట్టు తెలిపారు. ఈ రెండు నెలల్లో ఈ పెరుగుదల మరింత వృద్ధి చెందిందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

లాక్ డౌన్ కు ముందు లోదుస్తులను ట్రయల్స్ వేసేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడది లేకపోవడం ఆన్ లైన్ లోనే తమ సైజు ప్రకారం బుకింగ్స్ పెరిగి పోయాయి.  ఆన్ లైన్ డిమాండ్ పెరుగుదలకు ఇదీ కారణంగా చెబుతున్నారు.
Tags:    

Similar News