• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 10 శనివారం 2018...

నవంబర్ 10 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-10 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: అప్పులు చేస్తారు. ఆదాయం తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ ల వారికి చికాకులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు శ్రమకు ఫలితం ఉండదు. రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు. ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

వృషభరాశి: అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆప్తుల చేయూత. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఐటీ నిపుణులు కార్యసాధన దిశగా సాగుతారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారిస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మిథునరాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. మిత్రులతో వివాదాలు పరిష్కారం.  రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలుగుతాయి. వ్యాపారాభివృద్ధి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలకు మంచికాలం.  ఐటీ నిపుణుల్లో మరింత ఉత్సాహం. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. మహిళలకు భూ - గృహయోగం. లక్ష్మీ స్తుతి మంచిది.

కర్కాటకరాశి: మానసిక ఆందోళనకు గురవుతారు. శారీరక రుగ్మతలు. ఔషధసేవనం. ఆదాయం అంతంత మాత్రం. ఆలయాల సందర్శనం. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపారాల్లో అడ్డంకులు. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు పర్యటనలు విరమించుకోవాలి. ఐటీ నిపుణులు ఇబ్బందులు పడుతారు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు ఆస్తిలాభం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

సింహరాశి: ఆదాయం కంటే ఖర్చులు అధికం.  బంధుమిత్రుల నుంచి విమర్శలు. ఆస్తి వివాదాలు. శారీరక రుగ్మతలు. రియల్టర్లు, కాంట్రాక్టర్లు అనుకున్నది సాధించలేక నిరాశ చెందుతారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. విద్యార్థులకు లేనిపోని చికాకులు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది. 

కన్యరాశి: కొత్త పరిచయాలతో ఉత్సాహం. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త కాంట్రాక్టుల కోసం యత్నిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులకు యత్న కార్యసిద్ధి. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు నూతనోత్సాహం.

తులరాశి: కష్టానికి తగ్గ ఫలితముండదు. పనుల్లో ఆటంకాలు. ఆదాయం క్షీణిస్తుంది. రియల్టర్లు కోర్టు కేసులు ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో శ్రమ, వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి వ్యక్తిగత సమస్యలు. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థుల అంచనాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబంతో విభేదాలొస్తాయి. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆప్తులు దగ్గరవుతారు. గృహనిర్మాణాలు చేపడుతారు. ప్రతిబ బహిర్గతమవుతుంది. రియల్ ఎస్టేట్ వారికి శుభవార్తలు. వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. మహిళలకు భూలాభాలు.  హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో చిక్కులు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ మస్యలు. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి. రియల్ ఎస్టేట్ వారికి యత్నాలు సఫలం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. ఐటీ నిపుణులు సత్తా చాటుకుంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. ఆదిత్యహృదయం పఠిస్తే మంచిది.

కుంభరాశి: స్థిరాస్తి వివాదాల నుంచి పరిష్కారం. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు తీరుతాయి. ఉత్సాహవంతంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ ల వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. ఐటీ నిపుణులు లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలు సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. దుర్గామాతకు అర్చనలు చేస్తే మంచిది.

మీనరాశి: శారీరక రుగ్మతలు. ఆదాయం తగ్గి నిరాశచెందుతారు. కాంట్రాక్టర్లు అంచనాలు తప్పుతాయి. వ్యాపారులకు అంతగా లాభాలుండవు. ఉద్యోగాల్లో నిదానంగా వ్యవహరిస్తే మంచిది. రాజకీయ, కళారంగాల వారికి మానసిక ఒత్తిడులు.ఐటీ నిపుణులు నిదానం పాఠిస్తే మంచిది. విద్యార్థులకు సమస్యలు. మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. కనకధార స్తోత్రాలు పఠిస్తే మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS