• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 15 సోమవారం 2018...

అక్టోబర్ 15 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-15 02:29 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి:  వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల జోక్యం సత్ఫలితాలనిస్తుంది. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. అందరి మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు.. వైద్యులకు చికిత్స చేసేటప్పుడు జాగ్రత్త. కాలంతో పోటీపడి పనిచేస్తారు.

వృషభరాశి: సంకల్పం నెరవేరుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, హోటల్, వైద్య రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, వేడుకలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగులు, కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్త్రీల అభిప్రాయాలకు తగిన గుర్తింపు. వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. కొత్త పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి.

మిథునరాశి: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. బీమా, పన్నుల వ్యవహారాల గురించి ఆరాతీస్తారు. కుటుంబ సభ్యుల విషయంలో శుభపరిణామాలు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఈరోజు హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి చికాకులు. వాహనాలపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు.

కర్కాటకరాశి: మనసుకు ఉల్లాసం కలిగే వార్త వింటారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. ఈరోజు స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ, పనిభారం అధికమవుతుంది. స్తీలతో మితంగా మాట్లాడండి. పోస్టల్, ఎల్.ఐ.సీ ఏజెంట్లకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఉత్సాహం అధికం.

సింహరాశి: వృత్తిపరమైన ప్రయాణాలు, చర్చలకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉపాధి, సేవ రంగాల వారికి ప్రోత్సాహకరం. సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలం. సంతానం విషయంలో మేలు జరుగుతుంది.

కన్యరాశి: మనసు ఉల్లాసంగా ఉంటుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక పరిస్థితిపై ప్రియమైన వారితో చర్చిస్తారు. చిట్ ఫండ్స్ కలిసి వస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం.

తులరాశి: తల్లిదండ్రుల వైఖరి ఉత్సాహం కలిగిస్తుంది. అద్దె, ధరలపై ఒక నిర్ణయానికి వస్తారు. నిత్యావసరాలు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ఆలోచనలు సమీక్షించుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాల విషయాల్లో ఏకాగ్రత అవసరం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. పత్రిక, వార్త సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం.

వృశ్చికరాశి: రహస్య సమాచారం అందుకుంటారు. విద్యా ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. ఐరన్, ఆటోమోబైల్, ట్రాన్స్ పోర్ట్, మెకానికల్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సురాశి: లక్ష్యసాధనకు అనుకూల సమయం. ఉత్సవాలు, ప్రదర్శనల కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు.

మకరరాశి: ఉద్యోగ , వ్యాపారాల్లో కొత్త లక్ష్యాలు నిర్ధేశించుకుంటారు. సమావేశాల్లో సత్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ పెద్దల వైఖరి ఉల్లాసంకలిగిస్తుంది. ప్రముఖులతో సమావేశాలు లాభిస్తాయి. గౌరవ మన్ననలు పొందుతారు. ధనవ్యయం, విరాళిలిచ్చే విషయంలో మెళకువ వహించండి. వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదు.

కుంభరాశి: సమావేశాలు, ఉరేగింపుల్లో పాల్గొంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. గత అనుభవంతో లక్ష్యసాధనకు తోడ్పడుతారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియమైన వారికి సంబంధించిన పనులు పూర్తిచేస్తారు.  కంప్యూటర్, ఎలక్ట్రానిక్ , మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం. ఇంటా బయటా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

మీనరాశి:  ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక పరమైన సమావేశాలు ఫలిస్తాయి. ప్రియమైన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారులకు అన్ని విధాల అనుకూలం. అవకాశాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు, దూర ప్రయాణాలకు అనుకూలం.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS