• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 14 ఆదివారం 2018...

అక్టోబర్ 14 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-14 01:36 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి: బంధుమిత్రుల కలయికతో ఆనందం. వేడుకలు, శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల విషయంలో శుభపరిణామాలు. పరిశోధనలపై ఆసక్తి. విద్యార్థులకు ఒత్తిడి.  అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. పరాశ్రయం ఉంటుంది. ఇతరులపై ఆధారపడుతారు.

వృషభరాశి: విందుల్లో పూర్వమిత్రులను కలుసుకుంటారు. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. లక్ష్యసాధనలో గత అనుభవం ఎంతో తోడ్పడుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చిట్ ఫండ్  రంగాల వారికి వృత్తి విషయాల్లో ప్రోత్సాహకరం. పనుల్లో ఆటంకాలు, ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం. అనారోగ్య సూచన. సామాజిక అనుబంధాల వల్ల ఒత్తిడి. వైద్యశాలల సందర్శనం.

మిథునరాశి: వేడుకల్లో పాల్గొంటారు. పెట్టుబడులపై ప్రతిఫలం అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అంచనాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. పనుల్లో ఆలస్యం. పోటీల్లో గెలుపుకోసం తపన. శ్రమాధిక్యం. రోగనిరోధక శక్తి పెంపు. పదిమందిలో గౌరవం కోసం ఆరాటం. అనవసర ఒత్తిడి.

కర్కాటకరాశి: వైద్యం, హోటల్, రిటైల్ వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరం.  బదిలీలు, వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలం. విందు, వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ , నిర్మాణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. సంతాన సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెంపు. దూర ప్రయాణాలపై ఆసక్తి. శత్రువులపై విజయం.

సింహరాశి: బోధన, విద్యాసంస్థలు, స్టేషనరీ, రవాణా, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం.  చిన్నారుల విద్యా విషయంలో శుభ పరిణామాలు సంభవం. సంకల్పం నెరవేరుతుంది. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు  అందుకుంటారు. ఈరోజు ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి. గృహసౌకర్యం కోసం ఆరాటం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయపాలన పాటించాలి. విద్యార్థులకు ఒత్తిడికాలం. సంతానంతో సమస్యలు.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంటి ఫర్నిచర్ ను సమకూర్చుకుంటారు. గృహ ప్రవేశాలకు అనుకూలం. రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువవుతుంది. కమ్యూనికేషన్స్ వల్ల చికాకులు. అనారోగ్య భావన. సౌకర్యాల వల్ల ఒత్తిడి. ఆహారంలో సమయపాలన.

తుల రాశి: ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. సోదరీ, సోదరుల విషయాల్లో శుభపరిణామాలు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభవార్త అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాగ్ధానాల వల్ల ఒత్తిడి. మాట విలువ పెరుగుతుంది. కుంటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులు శ్రమతో విజయాలు సాధిస్తారు.

వృశ్చికరాశి: పెట్టుబడులు సమీక్షించుకుంటారు. దీర్గకాలిక పెట్టుబడులు మాత్రం లాభదాయకం. సినీ, రాజకీయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. శారీరక శ్రమ ఉంటుంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు. కుటుంబంలో సమస్యలు, ఆర్థిక నిల్వలు కోల్పోతారు.

ధనుస్సురాశి: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనులు పూర్తి చేస్తారు. శ్రమాధిక్యంతో కార్యసాధన చేయాలి.

మకరరాశి: విద్య, విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సినీ, రాజకీయ రంగ ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు.  ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు.

కుంభరాశి: సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాల్లో లక్ష్యాలు సాధిస్తారు. బోధన, న్యాయ, రక్షణ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాల్లో ప్రణాళికబద్దంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తుల్లో ఒత్తిడి ఉంటుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. కళాకారులకు ఆసక్తి పెరుగుతుంది. సమష్టి ఆదాయాలు ఉంటాయి.

మీనరాశి: ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.  వారసత్వ విషయాలు లాభిస్తాయి.బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. దూరదృష్టి ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం. అధికారులతో అప్రమత్తత. కీర్తి ప్రతిష్టల పట్ల జాగ్రత్త అవసరం.

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS