• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 10 బుధవారం 2018...

అక్టోబర్ 10 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-10 01:44 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థిక పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు.

వృషభ రాశి: సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. విందు - వినోదాల్లో పాల్గొంటారు. ఆస్పత్రులు - వ్యవసాయం - పరిశ్రమలు - హోటల్ - కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రిజిస్ట్రేషన్లు - కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం.

మిథునరాశి: బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాల గురించి ఆరాతీస్తారు. మీలో ప్రతిభకు గుర్తింపు. గౌరవ మర్యాదలు - ఉన్నత పదవులు లభిస్తాయి. పదవీ స్వీకారాలు - వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. టీవీ - మీడియా రంగాల్లోని వారికి లాభప్రదం.

కర్కాటకరాశి: కుటుంబ సభ్యుల వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై దృష్టిపెడతారు. బంధువుల రాక. బదిలీలు - మార్పులకు అనుకూలం. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. దంపతుల మధ్య చికాకులు నెమ్మదిగా సమసిపోతాయి. విద్యుత్ - ఏసీ - కూలర్లు - మెకానికల్ రంగాల్లోని వారికి సంతృప్తి లభిస్తుంది. వస్త్ర వ్యాపారులకు ప్రోత్సాహకరం. కార్మికుల్లో ఆందోళన ఎక్కువవుతుంది.

సింహరాశి: సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్ - ఫోన్ సందేశాలు అందుకుంటారు. చర్చలు - సమావేశాల్లో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. ప్రయాణాలతో ఉల్లాసం. వృత్తి -  ఉద్యోగాల్లో పురోభివృద్ధి. నిర్మాణ పథకాల్లో సంతృప్తి చేకూరుతుంది.వ్యాపారస్థులకు పురోభివృద్ధి.

కన్యరాశి: అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం సమకూరుతుంది. బోనస్ - ఇంక్రిమెంట్లు అందుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. పెంపుడు జంతువులపై ప్రేమ - శ్రద్ధ చూపిస్తారు.

తుల రాశి: ఆలోచనలు సమీక్షించుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు కొలిక్కివస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కళా - ఫొటోగ్రఫీ - రంగాల వారికి అనుకూల సమయం. వేడుకలు - ఉత్సాహాల్లో పాల్గొంటారు. వ్యవసాయ ఎగుమతి - దిగుమతులు లాభిస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి.

వృశ్చికరాశి: సినీ - రాజకీయ - న్యాయ - బోధన రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. వినోదం - ఫొటోగ్రఫీ - రచనా రంగాల వారికి అనుకూలం. దూర ప్రయాణాలు - ఉత్సవాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. శుభకార్యాల రీత్యా ధనవ్యయం.  పనులు పూర్తి అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గుర్తింపు.

ధనురాశి: ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. మిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సహకార సంఘాలు - యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రాజకీయ ప్రత్యర్థులను తిప్పకొడుతారు.  కంపెనీలో పనిచేసే వారికి సంతృప్తి కనిపిస్తుంది.  వ్యాపారుల్లో పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి.

మకరరాశి: పెద్దల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు. గౌరవ మన్ననలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి - వ్యాపార రంగాల్లోని వారికి సహచరుల మద్దతు లభిస్తుంది. వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు.

కుంభరాశి: చర్చలు - ప్రయాణాలు ఫలిస్తాయి. వేడుకలు - ఉత్సవాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. న్యాయ - బోధన - రక్షణ - రవాణా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులకు అనుకూలం. స్త్రీలకు శుభవార్తలు - ఖర్చులు అధికరం.

మీనరాశి: వాయిదా పద్ధతులపై వస్తువులు కొంటారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా ఉంటుంది. పూజలు - ఉత్సవాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. సంతానంతో చికాకులు. ఖర్చులు ఆదాయినిక తగ్గట్లు ఉంటాయి. మీ విషయాలు పంచుకోకండి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS