• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 8 సోమవారం 2018...

అక్టోబర్ 8 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-08 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: విందులు - వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి - వ్యాపారాల్లో భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వృత్తిపరమైన సమావేశాలు ఫలిస్తాయి. మీ సమర్ధత - చాకచర్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. శారీరక శ్రమ అధికమవుతుంది. భార్య - భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫ్యాన్సీ - స్టేషనరీ - రసాయన - సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం.

వృషభరాశి:  వైద్యం - ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభప్రదం. చిన్నారులు - ప్రియమైన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మార్కెటింగ్ - ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదా పడుతున్న పనులు పున: ప్రారంభిస్తారు. పెరుగుతున్న ఖర్చులు - ఇతరత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి.

మిథునరాశి: ప్రియమైన వారి కలయికతో ఇంట్లో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరితో ఉల్లాసం కలుగుతుంది. రియల్ ఎస్టేట్  - నిర్మాణ రంగాల వారికి శుభప్రదం. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి - పనిభారం అధికమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

కర్కాటకరాశి: ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. చర్చలు - ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు - రిజిస్ట్రేషన్లకు అనుకూలం. సోదరీ సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఈరోజు వృత్తులు - చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒడిదుడుకులు కలుగుతాయి. విద్యార్థులకు చదువులపై అనాసక్తి.  నూతన పరిశ్రమలు - వ్యాపార విస్తరణలకు అనుకూలం.

సింహరాశి: విద్య - ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఒప్పందాలకు అనుకూలం. బిల్లులు - చెక్కులు అందుకుంటారు. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. ఆర్థిక లావాదేవీలకు సమర్థంగా నిర్వహిస్తారు. పెద్దలు - పిల్లల ఆరోగ్యంలో స్వల్ప చికాకులు.

కన్యరాశి: వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఆలోచనలు చేసేందుకు తగిన సమయం. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరపు వివాదాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొబ్బరి - పండ్లు - పూల - చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.  అనుకున్న కార్యాలు మధ్యలో నిలిచిపోతాయి.

తుల రాశి: అలజడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. గతానుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సినీ - రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘకాలంగా వాయిదాపడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకూలతలు. దూర ప్రయాణాల ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడితప్పదు.

వృశ్చికరాశి: సమావేశాలు - ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తారు. వేడుకలు - శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆడిటర్లు - కన్సల్టెంట్ లకు అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఉన్నత విద్య సంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత. కాంట్రాక్టర్లు.. పెద్ద కాంట్రాక్టులు పొందుతారు. నిరుద్యోగులకు నిరుత్సాహక ఫలితాలు.

ధనురాశి: న్యాయ  - భోదన - రక్షణ రంగాల వారు గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి - వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మార్కెట్ రంగాల వారికి - నిరుద్యోగులకు సదావకాశాలు. లిటికేషన్ వ్యవహారాలు వాయిదా వేయండి.

మకరరాశి: విద్యాసంస్థల్లో ప్రవేశం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. రాజకీయ - న్యాయ - భోదన - రక్షణ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఏసీ కూలర్ మెకానిక్ రంగాల వారికి సంతృప్తి కనిపిస్తుంది.  తెలివితేటలతో గుర్తింపు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

కుంభరాశి: ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. బీమా - గ్రాట్యూటీ - పింఛన్ - మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలకు అనుకూలం.  రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళలు - క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి - చికాకులు ఎదుర్కొంటారు. మీ కార్యక్రమాలు - పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

మీనరాశి: ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. అంచనాలు - పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది.  ఉద్యోగులకు గుర్తింపు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS