• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 28 శుక్రవారం...

సెప్టెంబర్ 28 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-28 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:   స్నేహ సంబంధాలతో ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. భాగస్వామ్యాలు లాభిస్తాయి.  పలుకుబడితో లబ్ది పొందుతారు. కందులు - ఎండుమిర్చి - స్టాకిస్టులు - వ్యాపారులకు సంతృప్తి కనిపిస్తుంది. స్త్రీలకు నూతన పరిచయాలతో ఇబ్బంది కలుగుతుంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలుగుతుంది. రవాణా రంగాల్లో వారికి సంతృప్తిగా ఉంటుంది.

వృషభరాశి: ఉద్యోగ సంస్థలు - పరిశ్రమలు - వైద్య రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విందు - వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు కలిసి వస్తుంది. మోసపోతారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లవుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రయాణాలు - చర్చలు - వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సినీ - రాజకీయ - న్యాయ - ఉన్నత విద్యా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. వ్యాపారాల్లో రాణిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో జాగ్రత్త. మొండి వైఖరి వల్ల చికాకులు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులుంటాయి.

కర్కాటకరాశి: ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరితో మనస్తాపాలు. ప్రదర్శనలు - సభలకు అనుకూలం. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరం. పత్రికలు, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు సంభవిస్తాయి. బేకరి - పండ్లు - స్వీట్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

సింహరాశి: ఇంటర్వ్యూల్లో ఆశించిన ఫలితాలు. కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు. వృత్తి - ఉద్యోగాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులు పెరుగుతారు. ఆపద సమయాల్లో బంధువుల అండ లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. రుణం తీర్చడానికి పైచేయి యత్నాలు ఫలిస్తాయి.

కన్యరాశి: ప్రణాళికబద్దంగా వ్యవహరించి ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. సంకల్ప సిద్దికి అనుకూలం. పెట్టుబడులకు సంబంధించి అనుకూలం. ప్రయాణాలకు నిధులు సమకూర్చుకుంటారు. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి మినహా ఆశించిన ఫలితం ఉండదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. స్త్రీలకు స్వీయ సంపాదన పెరుగుతుంది. మూక్కుసూటి తనంతో గొడవలు అవుతాయి.

తులరాశి: పూర్వమిత్రులతో పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలపై స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. మ్యూచువల్ ఫండ్స్ - బ్యాంకు లావాదేవీలు లాభిస్తాయి. హామీలు - చెక్కుల జారీలో జాగ్రత్త. ప్లీడర్లు - గుమాస్తాలకు చికాకులు. ప్రయాణాల్లో చికాకులు. పరిచయాలు ఉన్నతికి ఉపయోగపడతాయి. వస్త్ర - బంగారం - వెండి - లోహ పనివాళ్లకు శుభదాయకం.

వృశ్చికరాశి: సమావేశాలు - బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లక్ష్యసాధనకు తోడ్పడుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో అనుబంధం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు. ఉద్యోగులకు అధికారులతో జాగ్రత్త. ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత. స్త్రీలు - వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ధనురాశి :  ఆహార నియమాలు పాటిస్తారు. వైద్యం - హోటల్ - రిటైల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వృత్తిపరమైన సమావేశాలు లాభిస్తాయి. ఆస్పత్రులు సందర్శిస్తారు. విదేశీయాన ప్రయత్నాలతో ఆటంకాలు. వృత్తి - ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయంలో జాగ్రత్త అవసరం.

మకరరాశి: చిట్ ఫండ్ లు - డిపాజిట్ల విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంకల్పం నెరవేరుతుంది. చిన్నారుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. ప్రముఖులతో వేడుకల్లో పాల్గొంటారు.  మీ ప్రతిభకు గుర్తింపు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త.  తప్పులు పునరావృతం చేయొద్దు. తేలిగ్గా మోసపోతారు. ఉపాధ్యాయులకు - రిప్రెజెంటేటివ్ లకు ఒత్తిడి - చికాకులు.

కుంభరాశి:  బదిలీల విషయంలో లక్ష్యం సాధిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం. రియల్ ఎస్టేట్  - నిర్మాణ రంగాల వారికి అనుకూలం. పుణ్యకార్యాలు చేస్తారు. స్త్రీలకు అదనపు సంపాదన. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం. పెద్ద ఆరోగ్యం జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.

మీనరాశి: స్టేషనరీ - రవాణా - బోధన - ఏజెన్సీ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో బాగుంటుంది. మిత్రుల కలయికతో ఆనందం. బిల్లులు - చెక్కులు అందుకుంటారు. కుంటుంబంతో శుభపరిణామాలు. ఇతరులకు వాహనం ఇవ్వడం మంచిది కాదు. సామూహిక సేవ కార్యక్రమాలు చేస్తారు. ప్రముఖులతో కలయికతో పనులు పూర్తవుతాయి.


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS