కేంద్రం మరో కీలక నిర్ణయం..ఆ రెండింటికీ ఒకటే ఉమ్మడి రాజధాని!

Update: 2020-01-27 09:07 GMT
డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీలను విలీనం చేయడంతో జనవరి 26వ తేదీ నుంచి దేశంలో మరో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల ముందే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు ప్రాంతాల్లోనూ పరిపాలనను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు  డయ్యూ డామన్ - దాద్రానగర్ హవేలీకి ఉమ్మడి రాజధానిగా డామన్ చేస్తూ  కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపొతే , ఈ రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేసే బిల్లు గతేడాది డిసెంబర్ 3న పార్లమెంట్‌ లో ఆమోదం పొందింది. ఈ విలీనంతో.. దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండనున్నాయి. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన మూడు నెలల అనంతరం డయ్యూ డామన్ - దాద్రానగర్ హవేలీలను విలీనం చేయాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు సమాచారం. రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఒకటిగా కలపడం వలన పరిపాలన పరంగా, స్ట్రాంగ్ అవుతుందని, ఒకటే రాజధానిగా ఉంచడం వలన పరిపాలన సౌలభ్యంతో పాటుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉండొచ్చని అంటున్నారు
Tags:    

Similar News