ఆ పదవితో డీఎస్‌ ఆనందిస్తాడా..?!

Update: 2015-05-25 06:48 GMT
తెలంగాణ కాంగ్రెస్‌ నేత, పీసీసీ మాజీ చీఫ్‌ డీ శ్రీనివాస్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తగురీతిలో సత్కరించనున్నదట. ఆయన అనుభవాన్ని.. రాజకీయ వ్యూహ చతురతను దృష్టిలో ఉంచుకొని ఆయనను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోనున్నదట! ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం లీకులు ఇచ్చింది. డీ శ్రీనివాస్‌కు పార్టీ జాతీయ విభాగంలో మంచి పదవిని ఇస్తామని చెబుతోంది.

    మరి ఈ మాత్రం పదవికి లీకులు ఇవ్వడం.. ఊరించడం ఏమిటో అనే ఆశ్చర్యలు అందరిలోనూ కలుగుతాయి. అయితే కాంగ్రెస్‌ రాజకీయాలు ఇలానే ఉంటాయి.

    ఇక్కడ విశేషం ఏమిటంటే.. డీ శ్రీనివాస్‌ ఈ పదవితో సంతృప్తి పడతాడా? అనేది. మొన్నటి వరకూ ఆయన ఎమ్మెల్సీగా ఉండేవాడు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నాడు. అయితే ఆయనటర్మ్‌ ముగిసింది.

    కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలంతో డీ శ్రీనివాస్‌ను మళ్లీ మండలికి పంపడం సాధ్యం కాలేదు. లభించిన ఒక్క సీటునూ ఆకుల లలితకు ఇచ్చారు. దీంతో శ్రీనివాస్‌ సైలెంటయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఇలాంటి నేపథ్యంలో ఆయన బోలెడు అసంతృప్తితో కూడా ఉన్నాడు. తనకు అవకాశం ఇవ్వలేదని ఆయన బాధపడుతున్నాడు. దీంతో ఊరడించడానికన్నట్టుగా ఆయనను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకొంటామని.. మంచి పదవి ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ప్రకటనలు వస్తున్నాయి. మరి పార్టీ అధికారంలో లేదు దీంతో..ఇలాంటి పదవులతో పెద్దగా లాభం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పదవితో శ్రీనివాస్‌ సంతృప్తి పడే అవకాశాలు తక్కువేనేమో!


Tags:    

Similar News