సినీ నటుడిగా సుపరిచితుడు.. తర్వాతి కాలంలో ఏపీ ప్రత్యేక హోదా గురించి పదే పదే ప్రస్తావిస్తూ పాపులర్ అయిన శివాజీ.. తర్వాతి కాలంలో తన గరుడపురాణంతో మరింత ఫేమస్ కావటం తెలిసిందే. టీవీ 9ను కొనుగోలు చేసిన అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సైబర్ పోలీసులు నోటీసులు ఇవ్వటం తెలిసిందే.
విచారణకు హాజరు కావాలని కోరినప్పటికీ ఇప్పటివరకూ సైబర్ పోలీసుల ముందుకు రాని ఆయన.. విదేశాలకు వెళ్లే క్రమంలో ఆయన్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తనకు ఇచ్చిన నోటీసులతో పాటు.. తన మీద పెట్టిన కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు శివాజీ. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషన్ వేసుకున్నారు.దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలా ఉంటే..తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడిచిన కొద్దికాలంగా బయటకు రాకుండా ఉన్న ఆయన.. విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా శివాజీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ లభించలేదు. ఇలాంటివేళ..ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫారిన్ కు వెళ్లే క్రమంలో దొరికారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలించినట్లుగా తెలుస్తోంది.