ప్రముఖ నటి పై కోర్టు ధిక్కార ఆరోపణలు
ప్రముఖ బెంగాలీ నటి, ఎంపీ అయిన నుస్రత్ జహాన్ చిక్కుల్లో పడ్డారు. కరోనా కారణంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ప్రతీ ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా బెంగాల్ లో పెద్ద ఎత్తున దేదీప్యమానమైన అలంకరణలతో దేవీ మండపాలు దర్శనమిస్తాయి. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది పాండల్స్ ఏర్పాటు చేయడంపై కోల్ కతా హైకోర్టు ఆంక్షలు విధించింది.
అయినప్పటికీ ఎంపీ నుస్రత్ జహాన్ పాండల్స్ లో దుర్గామాత పూజా కార్యక్రమాలకు హాజరయ్యారని పిటీషనర్ కోర్టుకు వివరించారు.
పాండల్స్ ను నో ఎంట్రీ జోన్‌లుగా ప్రకటించినప్పటికీ ప్రజాప్రతినిధులు నుస్రత్ జహాన్, దేవీ మండపాలను దర్శించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కోర్టు ఆంక్షలను బేఖాతరు చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లే అని పేర్కొన్నారు. దీంతో ఆమెపై కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి.