• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మైనర్ల పై సెక్స్‌ సైకో...

మైనర్ల పై సెక్స్‌ సైకో దంపతుల లైంగిక దాడి.. 75 ఏళ్ల జైలు శిక్ష

By - Tupaki Desk
Update: 2020-04-17 02:45 GMT
పాశ్చాత్య దేశాల్లో ఈమద్య కాలంలో మైనర్లపై లైంగిక దాడులు.. సెక్స్‌ సైకోగా మారిన ఉదంతాలను వింటూనే ఉన్నాం. తాజాగా అమెరికాకు చెందిన దంపతులు సెక్స్‌ సైకోలుగా మారి వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాకుండా ప్రవర్తించి మైనర్ల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. రెండు సంవత్సరాల్లో నలుగురి మైనర్లతో ఈ దంపతులు అసహజ శృంగారంకు ప్రయత్నించారు. వీరి విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ముందుకు తీసుకు వెళ్లారు. కోర్టు ఆమెకు 75 ఏళ్ల జైలు శిక్ష, అతడికి 40 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.

అమెరికాలోని ఇలినాయిస్‌ కి చెందిన ఆండ్రియా ఇంకా ఆమె భర్త జెరెమి లిస్‌గాంగ్‌ విపరీతమైన శృంగార కోర్కెలు. ముఖ్యంగా ఆండ్రియాకు అసహజ శృంగారం అంటే పిచ్చి. ఆ పిచ్చితో ఆమె మైనర్లను లైంగికంగా వేదిస్తూ సైకోలా మారిపోయింది. రెండు సంవత్సరాల వ్యవధిలో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిపై వీరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆండ్రియా సెక్స్‌ సైకోగా మారడంతో ఆమె భర్త కూడా మద్దతుగా నిలిచేవాడు. ఇద్దరు కలిసి అత్యంత రాక్షసంగా మైనర్లపై శృంగారంకు పాల్పడేవారు.

2016 నుండి 2018 సంవత్సరాల మద్య వీరి రాక్షస క్రీడ సాగింది. వీరిద్దరు కూడా అత్యంత ప్రమాదకరంగా మారారంటూ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాటు వారి వల్ల ఇబ్బందులు పడ్డ మైనర్‌ లను విచారించిన కోర్టు రెండేళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో వారికి తగిన శాస్తి జరిగినట్లయ్యిందని స్థానికులు అంటున్నారు.

వారిని జీవితాంతం జైలులోనే ఉంచేలా తీర్పు ఇవ్వాలంటూ వారి ప్రత్యర్థి న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో ఆమెకు 75 ఏళ్లు.. అతడికి 40 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అమెరికాలో ఈమద్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్న కారణంగా కఠినంగా శిక్షలు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ శిక్షను వేసినట్లుగా కోర్టు పేర్కొంది.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • America 
  • Couple Shocking Behaviour With Minors 

Similar News

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS