• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా వైరస్ పేరు...

కరోనా వైరస్ పేరు మారిపోతుందా?

By - Tupaki Desk
Update: 2020-03-21 15:49 GMT
యావత్తు ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పేరు వింటేనే వణికిపోతున్నాయి. ఈ వైరస్ బారి నుంచి తన ప్రజలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. మన దేశ ప్రభుత్వం ఏకంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పేరిట ఏకంగా యావత్తు దేశాన్ని బయటకు రాకుండా ప్రణాళికలు రచించింది. ఇలాంటి నేపథ్యంలో కరోనా అంటే... అదేంటో తెలియని పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితి నెలకొంది. అయితే కరోనా, లేదంటే కోవిడ్-19 గా పిలుచుకునే ఈ మహమ్మారి వైరస్ ఇకపైనా ఇదే పేరుతో కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికి అగ్రరాజ్యం, ప్రపంచ పోలీస్ గా పేరుగాంచిన అమెరికా వైఖరేనని చెప్పక తప్పుదు.

అయినా అంతా కరోనా అని పిలుచుకునే ఈ వైరస్ పేరు మార్చాలని అగ్రరాజ్యం గానీ, ఆ దేశ అధినేత డొనాల్డ్ ట్రంప్ గానీ ఎందుకు యత్నిస్తున్నారంటే... దాని వెనుక చాలా కథే ఉందని చెప్పాలి. కరోనా వైరస్ చైనా నుంచే ప్రస్థానం ప్రారంభించిన సంగతి తెలిసిందే. చైనాలోని వూహాన్ నగరంలో ఉనికిలోకి వచ్చిన ఈ వైరస్ చైనా ప్రభుత్వం వైఖరి కారణంగానే ఇతర దేశాలకు పాకిందన్నది ట్రంప్ భావన. అందుకే ఆయన దీని పేరును కరోనాగా కాకుండా 'చైనా వైరస్' గా నామకరణం చేశారు. ఈ వైరస్ వ్యాప్తి చెందిన నాటి నుంచి కూడా ఎప్పుడు మీడియా తో మాట్లాడినా కూడా ఈ వైరస్ ను ఆయన చైనా వైరస్ గానే పిలుస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓ మీడియ  సమావేశంలో కరోనా వైరస్ ను చైనా వైరస్ అని ఎందుకు పిలుస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగితే... దాని పేరు చైనా వైరస్సేనని ట్రంప్ కాస్తంత గట్టిగానే సమాధానమిచ్చారు. ట్రంప్ వైఖరి చూస్తుంటే... కరోనా వైెరస్ అని పిలిచేందుకు ఆయన ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. తనతో భేటీ అయిన ఓ దేశ కీలక అధికారికి కరోనా సోకిందన్న వార్తలు వినబడగానే... ట్రంప్ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. అదే పాజిటివ్ అని వచ్చి ఉంటే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తి రేకెత్తించే ప్రశ్నే. మొత్తంగా చైనా నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోందన్న భావనకు వచ్చిన ట్రంప్... దాని పేరును చైనా వైరస్ గా నామకరణం చేసేశారు. సో... రానున్న రోజుల్లో కరోనాను చైనా వైరస్ అని పిలిచినా ఆశ్చర్యపోనక్కర లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • International news 
  • corona 
  • covid 19 
  • america 
  • trump 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS