వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

Update: 2021-05-03 09:30 GMT
తెలంగాణ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారమని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. గత రెండు రోజుల నుండి ఈ ప్రక్రియ టీకాల కొరత కారణంగా ఆగిన విషయం తెలిసిందే. ఇక మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ దాన్ని కూడా వాయిదా వేశారు.

ఈ నేపథ్యంలో మళ్లీ  వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే 45 ఏళ్లు దాటిన వారికే మాత్రమే కరోనా టీకాలు వేస్తామని ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు ప్రకటించారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్‌  చేసుకొని వారికి టీకాలు వేయటం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ ఎం సీ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.  జీహెచ్ ఎంసీ లోని ఒకో కేంద్రంలో రోజుకు 200 మందికి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. మిగతా చోట్ల ఒక్కో కేంద్రంలో 100 మందికి  టీకాలు వేయనున్నట్లు తెలిపారు  శ్రీనివాస రావు. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ‌లో క‌రోనా కేసుల విజృంభ‌ణ కాస్త త‌గ్గింది.  మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 5,695 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,206 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,73,933 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,417గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 80,135 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
Tags:    

Similar News