20 నిమిషాల్లోనే కరోనా ఫలితం.. చౌక ధరల్లో కిట్ ఆవిష్కరణ
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వైరస్ ను నిర్ధారించే పరికరాలు, వ్యాక్సిన్, మందుల తయారీలో పలు ఆవిష్కరణలు చేస్తున్నారు. టెస్టుల విషయంలో కరోనా ప్రారంభమైన నాటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయి. కరోనాను నిర్ధారించే పరికరాలతో పాటు తాత్కాలికంగా కరోనాకు అడ్డుకట్టవేసేందుకు కొన్ని రకాల మందులను శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. కరోనాను నిర్ధారించడానికి ఇప్పటికే యాంటీ జెన్ కిట్లు, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వంటివి ఉండగా తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కేవలం 20 నిమిషాల్లోనే కరోనా ను నిర్ధారించే చవకైన పరికరాన్ని ఆవిష్కరించారు.
ఇది అత్యంత వేగమైనదే గాక, సులభమైనదని మెల్బోర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిమ్ స్టినర్ తెలిపారు. ఈ టెస్టింగ్ విధానానికి 'ఎన్ 1 స్టాంప్ లాంప్ ' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ విధానంలో చిన్న పోర్టబుల్ యంత్రాన్ని ఉపయోగించి వ్యాధి లక్షణాలు ఉన్న వారి ముక్కు నుంచి శ్వాబ్ సేకరిస్తారు. 20 నిమిషాల్లో ఫలితాన్ని కూడా ప్రకటిస్తారు. ఇప్పుడున్న అన్ని పద్ధతిలో కెల్లా ఈ పద్ధతి వేగవంతమైనది, చౌకైనది కూడా అని పరిశోధకులు వెల్లడించారు.
ఈ పద్ధతి ద్వారా కేవలం ఒక ట్యూబ్ ను ఉపయోగించి, ఒక దశలోనే ఫలితాన్ని సాధించ వచ్చని పేర్కొన్నారు. 151 శాంపిల్స్ పరీక్షించాలనుకున్నపుడు ఎన్ 1 స్టాంప్ లాంప్ ' విధానంలో 100 శాతం ఫలితాలు ఖచ్చితత్వం కూడి ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి వేగవంతమైన పరీక్షల వల్ల రోగి లక్షణాలు వెంటనే నిర్ధారించి, వెంటనే చికిత్స ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టం కూడా తగ్గించొచ్చు.