కరోనా ఎఫెక్ట్ .. అప్పుల్లో కూరుకుపోయిన మిల్లీనియల్స్ !

Update: 2020-12-11 08:07 GMT
మిల్లీనియల్స్‌ .. 1981-1996 మధ్య కాలంలో పుట్టిన వ్యక్తులుగా చెప్తారు. కరోనా కారణంగా దాదాపు సగం మంది మిల్లీనియల్స్ రుణాలు పెరిగినట్లు బ్రిటిష్ బ్యాంకు స్టాండర్డ్ చార్టర్డ్ సర్వేలో వెల్లడైంది. వీరికి రోజువారీ ఖర్చు కూడా భారంగా మారిందట. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా, భారత దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు పోయాయని తెలిపింది. ముఖ్యంగా వ్యవస్థీకృత విభాగంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ కారణంగా భారీగా ఉద్యోగ నష్టం జరిగిందని, అయితే అన్ లాక్ తర్వాత కాస్త కోలుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది.  

స్టాండర్డ్ చార్ట్ భారత్ సహా 12 దేశాల్లో 12,000 మందితో ఈ సర్వే నిర్వహించింది. సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ మధ్య సర్వే చేసింది. ఈ కాలంలో తమ రుణాలు పెరిగినట్లు 44 శాతం మంది ఇండియన్ మిల్లీనియల్స్ చెప్పారు. అదే సమయంలో 45 ఏళ్లకు పైబడిన వారు 28 శాతం మంది మాత్రమే రుణభారం పెరిగినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత మనీ మేనేజ్ ‌మెంట్ ఇబ్బందికరంగా మారిందని ప్రపంచవ్యాప్తంగా 64 శాతం మంది చెప్పగా, భారత్‌ లో మూడొంతుల మంది చెప్పారు.కరోనా వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయని సర్వే నిర్వహించిన స్టాండర్డ్ చార్ట్ బ్యాంకు తెలిపింది.

 జీడీపీ అంచనాలూ క్రమంగా మెరుగు అవుతున్నాయని పేర్కొంది. మిల్లీనియల్స్‌ కు కరోనా ఓ ఆర్థిక మేల్కొలుపుగా భావించవచ్చునని, ద్రవ్యపరమైన అంశా ల్లో అవగాహన పెరుగుతోందని, దీర్ఘకాలిక పొదుపు, ఖర్చులపై జాగ్రత్త, పెట్టుబడులపై ఆసక్తి కనిపిస్తోందని తెలిపింది. భారత్‌లో దాదాపు సగం మంది మిల్లీనియల్స్ కొత్త కారు లేదా ఇల్లు కొనుగోలు కోసం ఆదా చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 48 ఏళ్లకు పైబడిన వారు ఇదే లక్ష్యంతో 28 శాతం ఉన్నారు. మిల్లీనియల్స్ లో  39 శాతం మంది పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తున్నారు. 45 ఏళ్ళు దాటిన వారిలో 26 శాతం మంది మాత్రమే పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
Tags:    

Similar News