కరోనా గన్నవరం ఎయిర్ పోర్టును అంతలా దెబ్బేసిందట
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు శంషాబాద్ లో ఉంది. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం తిరుపతి (రేణిగుంట).. కడప.. బెజవాడ (గన్నవరం).. రాజమండ్రి.. విశాఖపట్నంలో విమానాశ్రయాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఒక్క ఎయిర్ పోర్టులు సాటికి.. ఏపీలోని ఐదు ఎయిర్ పోర్టులు దరిదాపుల్లోకే రావు. ఈ విషయం ఇలా ఉంటే.. ఇటీవల కాలంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున ప్రయాణికుల సంఖ్య పెరగటం తెలిసిందే.
అయితే.. ఈ జోరుకు బ్రేకులు వేసింది కరోనా. వివిధ ప్రాంతాల నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చే వారి సంఖ్య దారుణంగా పడిపోవటం గమనార్హం. కరోనాకు ముందు ప్రతి నెల తక్కువలో తక్కువ లక్ష వరకు స్వదేశీయా ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉండేది.
కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయింది. లాక్ డౌన్ ఆంక్షల్ని ఎత్తేసి.. అన్ లాక్ ఫేజులు మొదలైన తర్వాత కూడా రాకపోకలు పెరగకపోవటమే కాదు.. ప్రయాణాలుచేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. కరోనాకు ముందు నెలకు లక్ష స్వదేశీ ప్రయాణికుల స్థానంలో.. అన్ లాక్ తర్వాత ప్రతి నెల 12 వేలకు మించి ప్రయాణికులు ప్రయాణాలు చేయటం లేదంటున్నారు.
దేశంలోని పలు ఎయిర్ పోర్టులు ఇప్పడిప్పుడే రికవరీ మోడ్ లోకి అడుగులు వేస్తుంటే.. గన్నవరం ఎయిర్ పోర్టులో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు. దీనికి కారణం.. ఏపీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. చాలామంది తమ ప్రయాణాల్ని వాయిదా వేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు గన్నవరం ఎయిర్ పోర్టులో 2.38లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేయగా.. మే మధ్య నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు ప్రారంభం కావటం తెలిసిందే. అప్పటి నుంచి జులై నెలఖరు వరకు కేవలం 34 వేల మంది మాత్రమే ప్రయాణాలు చేసినట్లుగా చెబుతున్నారు. కరోనా ఎఫెక్టు గన్నవరం ఎయిర్ పోర్టుకు భారీగా ఉందంటున్నారు. కరోనా కేసుల తీవ్రత తగ్గే వరకు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందంటున్నారు.