వజ్రాయుధాన్ని బయటకు తీసిన కాంగ్రెస్!
షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది కాంగ్రెస్. కమలనాథుల కలను కల్లలు చేసేందుకు వజ్రాయుధాన్ని బయటకు తీసి కమలనాథుల మీద సంధించింది. దీంతో..అసంతృప్త నేతలందరికి మంత్రిపదవులు అందేలా చేయటం ద్వారా.. ఒక అడుగు వెనక్కి వేసినా..బీజేపీ నేతలకు ఏ మాత్రం కర్ణాటక పీఠం అందని రీతిలో కొత్త ప్లాన్ ను తెర మీదకు తెచ్చింది. దీంతో.. కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభం ఉందన్న మాటకు భిన్నమైన పరిస్థితినెలకొంటుందని భావిస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
ఆపరేషన్ కమలం పేరుతో గడిచిన కొన్ని నెలలుగా కర్ణాటక అధికార పీఠాన్ని చేజిక్కించుకోవటం కోసం కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. నోటి వరకూ వచ్చి చేజారిన అధికారాన్ని సొంతం చేసుకోవటానికి బీజేపీ నేతలు వేస్తున్న ఎత్తులకు ఎప్పటికిప్పుడు చెక్ చెబుతోంది కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం. తాజాగా అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పదవులకురాజీనామా చేయటం ద్వారా కుమారస్వామి ప్రభుత్వానికి నూకలు చెల్లేలా ప్లాన్ చేసింది బీజేపీ అధినాయకత్వం.
అంతేకాదు.. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా ముంబయిలో క్యాంప్ రాజకీయానికి తెర తీయటం తెలిసిందే. ఇందుకోసం బెంగళూరు నుంచి ఎమ్మెల్యేలు పలువురిని బీజేపీకి చెందిన నేత సొంత విమానంలో ముంబయికి తరలించటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అసంతృప్త నేతల్ని బుజ్జగించేందుకు వీలుగా కుమారస్వామి కేబినెట్ లోని మంత్రులంతా కీలక నిర్ణయం తీసుకొని ముకుమ్మడి రాజీనామాలు చేశారు.
దీంతో అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కేలా చేయటంతో పాటు.. ప్రభుత్వం కూలిపోకుండా మహా ఎత్తు వేశారు. డిప్యూటీ సీఎం పరమేశ్వరతో సమా కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది జేడీఎస్ కు చెందిన 10 మంది మంత్రులు పదువుల్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే తమ రాజీనామా లేఖల్ని ముఖ్యమంత్రి కుమారస్వామి చేతికి ఇచ్చారు.
రెబెల్ ఎమ్మెల్యేగా మారి పదవులు తమకు లేవన్న 14 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసేందుకు వీలుగా తాజాగా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా పరిణామంతో అసంతృప్త నేతలను బుజ్జగించే వీలుందని భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముంబయి క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను కర్ణాటకకు తిరిగి తీసుకొచ్చేందుకు వీలుగా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.
ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ -జేడీఎస్ ప్లాన్ కు బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవటం ఖాయమన్న పరిస్థితి నుంచి.. తెప్పరిల్లే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
ఏమైనా.. కమలనాథులకు దిమ్మ తిరిగేలా షాకివ్వటంలో కాంగ్రెస్-జేడీఎస్ నేతలు సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. ఒకవేళ ఈ వ్యూహంలో కాంగ్రెస్-జేడీఎస్ లు విఫలమైనా.. పదవుల్ని త్యాగం చేసినా ఫలితం దక్కలేదన్న సానుభూతి ప్రజల్లో వెల్లువెత్తటమే కాదు.. అసంతృప్త ఎమ్మెల్యేల ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుందని చెప్పక తప్పదు.