బాబుతో పొత్తు..కాంగ్రెస్‌ కు బాగానే గిట్టుబాటవుతోంది..

Update: 2018-11-02 15:30 GMT
ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అక్కడి కాంగ్రెస్ నేతలు ఏమాత్రం ఇష్టపడనప్పటికీ ఈ పొత్తు మాత్రం వారికి బాగానే లాభిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎక్కడా ఒంటరిగా గెలిచే పరిస్తితి లేని తరుణంలో టీడీపీ సహకారం కాంగ్రెస్‌ కు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.
   
మరోవైపు పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్‌ కు చంద్రబాబు ఎక్కువ సీట్లే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 25 అసెంబ్లీ - 5 పార్లమెంటు సీట్లు ఇవ్వడానికి చంద్ర బాబు రెడీగా ఉన్నారట.
   
ముఖ్యంగా టీడీపీ బలహీనంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్‌ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప - కర్నూలు జిల్లాల్లో వైసీపీ బలంగా ఉండడంతో అక్కడ కాంగ్రెస్‌ లోని సీనియర్లు - మాజీ మంత్రులను రంగంలోకి దించి టీడీపీ నుంచి పూర్తి సహకారం అందించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలోనూ కాంగ్రెస్‌ కు టిక్కెట్లివ్వాలని చంద్రబాబు అనకుంటున్నారట.
   
అయితే... కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లిచ్చే నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. రెండు పార్టీల నేతల మధ్య తొలి నుంచి సఖ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయడం కష్టమైన పనేనన్న మాట రెండు పార్టీల నుంచీ వినిపిస్తోంది.
Tags:    

Similar News