కాంగ్రెస్ ఖేల్ ఖతం.. సింగిల్ డిజిట్ కే పరిమితం

Update: 2020-12-04 11:50 GMT
గ్రేటర్ ఎన్నికల్లో ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ ప్రచారంలో ఫలితాల్లో తలపడుతుంటే తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఫలితాలు విడుదలవుతున్న వేళ కాంగ్రెస్ కేవలం ఒక్క డివిజన్ మాత్రమే విజయం సాధించి మరో రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇందులో ఒకటి గెలవచ్చు అని అంటున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

టీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్దగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. దుబ్బాక విజయంతో బీజేపీకి జనం ఆకర్షితులవ్వగా కాంగ్రెస్ మాత్రం ఉన్న బలాన్ని నిలుపుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లను బీజేపీ కొల్లగొట్టినట్టు కనిపిస్తోంది.

గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. పార్టీ అభ్యర్థులు 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ కు పలుచోట్ల గట్టి పోటీనిస్తున్నారు. ఏఎస్ రావునగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి ఒక్కరే గెలుపొందారు. ఎందరు గెలిచినా కనీసం 10 స్థానాలు కూడా గెలవలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని అర్థమవుతోంది.

ఈ ఫలితంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు మరింతగా కాంగ్రెస్ పార్టీ కుదేలయ్యే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ ప్లేసులో బీజేపీ పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News