అనర్హత పై సుప్రీం తలుపు తట్టారు

Update: 2015-12-01 16:24 GMT
తమ పదవులకు రాజీనామా చేయకుండా.. అధికారపార్టీలో చేరిపోయిన తమ పార్టీ నేతలపై తెలంగాణ తెలుగుదేశం.. కాంగ్రెస్ లు సీరియస్ గా ఉన్నాయి. తాజాగా ఈ రెండు పార్టీలు సుప్రీం కోర్టు తలుపు తట్టాయి. ఒక పార్టీ నుంచి గెలిచి.. మరోపార్టీకి వలస పోతున్న తీరుపై ఈ రెండు పార్టీలు.. సుప్రీంను ఆశ్రయించాయి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం స్పీకర్ పరిధిలోనిదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన మీదట.. దీనిపై న్యాయం కోసం సుప్రీంను ఆశ్రయించింది.

సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్ గుర్తు మీద గెలిచిన నేతలు పలువురు టీఆర్ఎస్ తీర్థం పుర్చుటం తెలిసిందే. దీనిపై ఈ రెండు పార్టీలు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యవహారం  స్పీకర్ పరిధిలో ఉన్న నేపథ్యంలో దీనిపై తాము నిర్ణయం తీసుకేమంటూ హైకోటు తేల్చింది. దీంతో. టీటీడీపీ.. కాంగ్రెస్ నేతలు తాజాగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి.. ఆ పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరటం.. పదవులు చేపట్టటాన్ని సుప్రీంకు చేసిన ఫిర్యాదులో విపక్షాలు పేర్కొన్నాయి. బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్న ఈ పిటీషన్ పై సుప్రీం ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. తాజాగా దాఖలు చేసిన పిటీషన్ తెలంగాణ సర్కారుకు ఎలాంటి తలనొప్పులు తెస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
Tags:    

Similar News