కుంభమేళాపై కాంగ్రెస్ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2020-10-15 17:37 GMT
భక్తులంతా పవిత్రంగా భావించే కుంభమేళాపై ఓ కాంగ్రెస్ నాయకుడు నోరుజారారు. కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ప్రభుత్వం కుంభమేళా పేరిట అలహాబాద్ లో 4200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

రాష్ట్రానికి సొంతంగా ఒక మతం అంటూ ఉండదని.. అలాంటప్పుడు మత ప్రచారాలు, బోధనలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం ఏంటని మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ ప్రశ్నించారు.

ఇక ఉదిత్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కోట్లాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని.. వారికి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఇదే అంశంపై యూపీ మంత్రి బ్రిజేష్ పాథిక్ కూడా మాట్లాడారు. కుంభమేళా అన్నది యూపీ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు హాజరవుతారని.. ఇలాంటి కార్యక్రమంపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
Tags:    

Similar News